×
Ad

Kamakshi Bhaskarla: హీరోయిన్స్ ఎందుకు చేయకూడదు.. నాకు నేనే సవాల్ చేసుకున్నా.. ఇప్పుడు అదే చేస్తున్నా..

కామాక్షి భాస్కర్ల.. ఈ నటి గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. (Kamakshi Bhaskarla)ఇక పొలిమేర సినిమాలో నటి అంటే మాత్రం టక్కున గుర్తుపట్టేస్తారు. రా అండ్ రస్టిక్ పాత్రలో ఆమె చూపించిన నటన ఆడియన్స్ ను ఒక రేంజ్ లో ఆకట్టుకుంది.

Heroine Kamakshi Bhaskarla made interesting comments about her next film

Kamakshi Bhaskarla: కామాక్షి భాస్కర్ల.. ఈ నటి గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఇక పొలిమేర సినిమాలో నటి అంటే మాత్రం టక్కున గుర్తుపట్టేస్తారు. రా అండ్ రస్టిక్ పాత్రలో ఆమె చూపించిన నటన ఆడియన్స్ ను ఒక రేంజ్ లో ఆకట్టుకుంది. ఇక ఈ సినిమాకు సీక్వెల్ గా (Kamakshi Bhaskarla)వచ్చిన పొలిమేర 2 సినిమాలో కూడా ఆమె అద్భుతమైన నటనను కనబరించింది. ఈ సినిమాకు గాను దాదా సాహెబ్ ఫాల్కే 2024 జ్యురీ అవార్డు కూడా అందుకుంది కామాక్షి. ఈ సినిమాల తరువాత కూడా చాలా మంచి మంచి సినిమాలు చేసింది ఈ బ్యూటీ.

Prabhas-Prem rakshith: ప్రభాస్ లిస్టులో మరో వరల్డ్ క్లాస్ మూవీ.. ఆస్కార్ విన్నర్ తో భారీ సినిమా.. అయితే ఇది కూడా..

ఈ అమ్మడు హీరోయిన్ గా నటిస్తున్న లేటెస్ట్ మూవీ “12ఎ రైల్వే కాలనీ”. అల్లరి నరేష్ హీరోగా వస్తున్న ఈ సినిమాను కొత్త దర్శకుడు నాని కసరగడ్డ తెరకెక్కిస్తున్నాడు. టీజర్ తో ఆసక్తిని రేకెత్తించిన ఈ సినిమా నవంబర్ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో, ప్రమోషన్స్ లో వేగం పెంచారు టీం. ఇందులో భాగంగా ఇంటర్వ్యూలో పాల్గొంది కామాక్షి భాస్కర్ల. ఈ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేసింది. “ఇది చాలా ఆసక్తితో సాగే సస్పెన్స్‌ థ్రిల్లర్‌ సినిమా. ఆరాధన అనే పాత్రలో నేను కనిపిస్తా. సినిమాలో నా పాత్ర చాలా కీలకం. ఆ పాత్ర లేకపోతే సినిమానే లేదు. సినిమాలో నా పాత్ర అందరికీ గుర్తుండిపోతుంది. విజయ్‌ సేతుపతి, సుహాస్‌, శ్రీవిష్ణు ఇలా చాలా మంది హీరోలు కొత్త కొత్త పాత్రలు చేస్తున్నారు. అలా హీరోయిన్స్ ఎందుకు చేయకూడదు అని ఒక సవాల్‌గా తీసుకున్నా”అంటూ ఆసక్తికర కామెంట్స్ చేసింది. కామాక్షి భాస్కర్ల.