Tamannaah
Tamannaah : హీరోయిన్ తమన్నా ‘జీ కర్దా’ Jee Karda సినిమా ప్రమోషన్‌లో బిజీగా ఉంది. ఇటీవలే లస్ట్ స్టోరీస్ 2 (lust stories 2) లో తన కో-యాక్టర్ విజయ్ వర్మ (Vijay Varma)తో డేటింగ్ చేస్తున్నట్లు కన్ఫర్మ్ చేసిన తమన్నా పెళ్లెప్పుడు అంటే మాత్రం క్లారిటీ ఇవ్వట్లేదు.
నటి తమన్నా వరుస షూటింగ్లు, ప్రమోషన్లతో బిజీగా ఉంది. తాజాగా ‘జీ కర్దా’ ప్రమోషన్‌లో బిజీగా ఉన్న ఈ బ్యూటీని పెళ్లి గురించి అడిగితే ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకుంది. ఇటీవలే విజయ్ వర్మతో డేటింగ్ చేస్తున్నట్లు యాక్సెప్ట్ చేసిన తమన్నా పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు చేసుకుంటానని చెప్పింది. పెళ్లంటే పార్టీ కాదని.. పెద్ద బాధ్యత అని దానికి చాలా సమయం ఉందని చెప్పింది. ఒక మొక్కను, కుక్కను పెంచడం, పిల్లల్ని కనడం వీటికి ఎలా బాధ్యతగా మనం సిద్ధమవుతామో పెళ్లి కూడా మనం సిద్ధం అయినపుడే చేసుకోవాలని సమాధానం ఇచ్చింది.
Tamannaah : విజయ్ వర్మతో రిలేషన్ షిప్ గురించి క్లారిటీ ఇచ్చిన తమన్నా.. అతను నా హ్యాపీ ప్లేస్ అంటూ..
విజయ్ వర్మ తనపట్ల చాలా శ్రద్ధ వహించే వ్యక్తి అని.. అతనితో తను చాలా సంతోషంగా ఉన్నాను అని మాత్రమే స్పష్టం చేసిన తమన్నా.. అతనితో పెళ్లి గురించి మాత్రం ఎక్కడా క్లారిటీ ఇవ్వకపోవడం విశేషం. నెట్‌ఫ్లిక్స్ ఆంథాలజీ చిత్రం లస్ట్ స్టోరీస్ 2 లో వీళ్లిద్దరూ స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు.