Tamannaah : అలాంటి సినిమాలతో హీరోలకే గుర్తింపు వస్తుంది.. అందుకే బాహుబలిలో నాకు గుర్తింపు రాలేదు.. తమన్నా సంచలన వ్యాఖ్యలు..

బాహుబలి సినిమాలో తమన్నా అవంతిక అనే పాత్రలో కనిపించి మెప్పించింది. అయితే పార్ట్ 1లో తమన్నా కొంచెం ఎక్కువసేపు కనిపించినా బాహుబలి పార్ట్ 2లో మాత్రం అతిధి పాత్రలా కనిపిస్తుంది.

Tamannaah : అలాంటి సినిమాలతో హీరోలకే గుర్తింపు వస్తుంది.. అందుకే బాహుబలిలో నాకు గుర్తింపు రాలేదు.. తమన్నా సంచలన వ్యాఖ్యలు..

Tamannaah sensational comments on Bahubali Movie

Updated On : June 14, 2023 / 12:27 PM IST

Bahubali  : స్టార్ హీరోయిన్ తమన్నా(Tamannaah) సినీ పరిశ్రమకు వచ్చి 17 ఏళ్ళు దాటినా ఇప్పటికి తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో వరుస సినిమా ఛాన్సులు సంపాదిస్తుంది. ఇటీవల బాలీవుడ్(Bollywood) నటుడు విజయ్ వర్మ(Vijay Varma)తో రిలేషన్ లో ఉందని వార్తలు రాగా తాజాగా అవును అంటూ క్లారిటీ కూడా ఇచ్చేసింది. త్వరలో తమన్నా లస్ట్ స్టోరీస్ 2(Lust Stories) సినిమాతో రాబోతుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తమన్నా ఇచ్చిన ఇంటర్వ్యూలో బాహుబలి(Bahubali) సినిమాపై సంచలన వ్యాఖ్యలు చేసింది.

తమన్నా మాట్లాడుతూ.. బాహుబలి లాంటి యాక్షన్ సినిమాలతో హీరోలకే ఎక్కువ గుర్తింపు వస్తుంది. అందుకే ఈ సినిమాతో ప్రభాస్, రానాలకు దేహవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. ఈ సినిమాలో నటించిన రమ్యకృష్ణ, అనుష్కలకు కూడా ఎంతో కొంత గుర్తింపు వచ్చింది. బాహుబలి సినిమాతో నాకు అంతగా గుర్తింపు రాలేదు. బాహుబలి సక్సెస్ ని అందరూ వాడుకున్నట్టు నేను వాడుకోలేకపోయాను. కానీ నా పాత్ర చిన్నదైనా ప్రేక్షకులకు నచ్చింది అని వ్యాఖ్యలు చేసింది. దీంతో తమన్నా చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

Sreeleela : శ్రీలీలను ఎత్తుకున్న బన్నీ.. ఈ కాంబినేషన్‌లో ఆహా కోసం స్పెషల్ మూవీ?

బాహుబలి సినిమాలో తమన్నా అవంతిక అనే పాత్రలో కనిపించి మెప్పించింది. అయితే పార్ట్ 1లో తమన్నా కొంచెం ఎక్కువసేపు కనిపించినా బాహుబలి పార్ట్ 2లో మాత్రం అతిధి పాత్రలా కనిపిస్తుంది. గతంలో బాహుబలి 2లో తమన్నా పాత్రపై సోషల్ మీడియాలో సరదా మీమ్స్ కూడా వచ్చాయి. ఇప్పుడు తమన్నా ఇలా మాట్లాడటంతో చర్చగా మారాయి ఈ వ్యాఖ్యలు. మరి దీనిపై బాహుబలి యూనిట్ ఏమన్నా స్పందిస్తుందేమో చూడాలి.