చూపుల్లో దాచినాడే ఏదో తూటా.. నన్నిట్ట కాల్చినాడే టా.. టా..

‘‘సరిలేరు నీకెవ్వరు’’ - ‘హి ఈజ్ సో క్యూట్ హి ఈజ్ సో స్వీట్’ సాంగ్ రిలీజ్..

  • Publish Date - December 16, 2019 / 12:46 PM IST

‘‘సరిలేరు నీకెవ్వరు’’ – ‘హి ఈజ్ సో క్యూట్ హి ఈజ్ సో స్వీట్’ సాంగ్ రిలీజ్..

సూపర్‌స్టార్ మహేష్ బాబు, రష్మిక జంటగా.. అనిల్ రావిపూడి దర్శకత్వంలో.. అనిల్ సుంకర, మహేష్ బాబు కలిసి నిర్మిస్తున్న సినిమా.. ‘‘సరిలేరు నీకెవ్వరు’’.. ‘మాస్ ఎమ్‌బి మండేస్ దిస్ డిసెంబర్ 5 మండేస్ 5 సాంగ్స్ గెట్ రెడీ గయ్స్’ అంటూ డిసెంబర్ నెలలో ఉన్న అయిదు సోమవారాలలో వారానికి ఒక పాట చొప్పున రిలీజ్ చేయనున్నామని తెలిపిన మూవీ టీమ్

‘మైండ్ బ్లాక్’ సాంగ్ తర్వాత ‘సూర్యుడివో చంద్రుడివో, పాటలు విడుదల చేయగా మంచి స్పందన వచ్చింది. మూడో సోమవారం సాయంత్రం ముచ్చటగా మూడో పాట రిలీజ్ చేశారు. ‘హి ఈజ్ సో క్యూట్ హి ఈజ్ సో స్వీట్’ అంటూ సాగే లిరికల్ వీడియో ఆకట్టుకుంటోంది.

మహేష్, రష్మిక పెయిర్, రష్మిక వేసిన స్టెప్స్ బాగున్నాయి. దేవి ట్యూన్‌కి శ్రీమణి లిరిక్స్ రాయగా మధుప్రియ పాడింది. 2020 జనవరి 5న ప్రీ-రిలీజ్ జరుపనున్నారు. మహేష్ మేజర్ అజయ్ కృష్ణగా కనిపించనున్న ‘సరిలేరు నీకెవ్వరు’ సంక్రాంతి కానుకగా 2020 జనవరి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.