వీడియో చేసింది.. వర్మకి నచ్చింది.. మీవి డేగ కళ్లు!..

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఓ యువతికి సోషల్ మీడియా ద్వారా నటనలో అవకాశమిచ్చాడు..

  • Publish Date - April 15, 2020 / 08:52 AM IST

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఓ యువతికి సోషల్ మీడియా ద్వారా నటనలో అవకాశమిచ్చాడు..

కాంట్రవర్సీ కింగ్ రామ్ గోపాల్ వర్మ లాక్‌డౌన్ నేపథ్యంలో మందుబాబులు ఇబ్బంది పడుతున్నారని తెలుగు రాష్ట్రాల సీఎంలకు విజ్ఞప్తి చేసి, కేటీఆర్‌తో ట్విట్టర్ వేదికగా సరదా సంభాషణ సాగించిన సంగతి తెలిసిందే. తాజాగా వర్మ ఓ అమ్మాయికి సినిమాలో ఆఫర్ ఇచ్చాడు. సాధారణంగా వర్మ తన సినిమాల్లో ఆర్టిస్టులు, టెక్నీషియన్లుగా ఎక్కువ శాతం కొత్తవారికి అవకాశం కల్పిస్తుంటాడు. కొత్త టాలెంట్‌ని ఎంకరేజ్ చేయడంలో వర్మ స్టైలే వేరు.

ఆడవాళ్ల అందాన్ని అమితంగా ఆరాధించే ఆర్జీవీ తాజాగా ఓ టిక్ టాక్ అమ్మాయికి బంపర్ ఆఫర్ ఇచ్చాడు. తన ట్విట్టర్‌ అకౌంట్‌లో సదరు యువతి టిక్‌టాక్‌ వీడియోను పోస్ట్‌ చేసిన వర్మ.. యాక్టింగ్‌పై ఇంట్రెస్ట్ ఉంటే harishraju0303@gmail.com కు వివరాలు పంపాల్సిందిగా కోరాడు.

Read Also : కరోనాపై కలిసి గెలుద్దాం.. పవన్, బన్నీ మిస్ అయ్యారు..

హైలెట్ ఏంటంటే @aquagirlak టిక్‌టాక్‌ ఐడీ పేరిట పోస్ట్‌ అయిన ఆ వీడియోలో అమ్మాయి.. గతంలో రామ్‌గోపాల్‌ వర్మ ఒక ఇంటర్వ్యూలో చెప్పిన చిన్న బిట్‌నే డబ్‌‌స్మాష్‌ చేసింది. అమ్మాయి చూడ్డానికి బాగానే ఉంది. కాకపోతే లిప్ సింక్ విషయంలో కాస్త మొహమాటం కనిపించింది. మొత్తానికి ఈ అమ్మాయి వీడియో చూసి వర్మ ఇంప్రెస్ అయ్యి అవకాశమిచ్చాడు. వర్మ ట్వీట్ చూసి నెటిజన్లు ‘మీవి డేగ కళ్లు’ అంటూ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.