Nani : నానికి తన కొడుకు అర్జున్ ఇచ్చిన క్రిస్మస్ గిఫ్ట్ ఏంటో చూశారా..?

నానికి తన కొడుకు అర్జున్ ఇచ్చిన క్రిస్మస్ గిఫ్ట్ ఏంటో చూశారా..? అర్జున్ తన నాన్నకి క్రిస్మస్ విషెస్ తెలియజేస్తూ ఒక లెటర్ రాసి ఇచ్చాడు.

Hi Nanna star Nani got beautiful christmas gift from his son Arjun

Nani : నేచురల్ స్టార్ నాని ఈ ఏడాది మంచి విజయాలనే అందుకున్నారు. దసరా సినిమాతో పాన్ ఇండియా మార్కెట్ లోకి అడుగుపెట్టి.. కెరీర్ లో 100 కోట్ల మార్క్ హిట్టుని అందుకున్నారు. ఇక రీసెంట్ గా ‘హాయ్ నాన్న’ సినిమాతో ఆడియన్స్ ముందుకు మనసు దోచుకున్నారు. అయితే నాని మనసుని తన కొడుకు అర్జున్ ఒక చిన్న బహుమతితో దోచుకున్నాడట. నేడు ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ సెలబ్రేషన్స్ జరుపుకుంటున్న విషయం తెలిసిందే.

దీంతో పలువురు సెలబ్రిటీస్ సోషల్ మీడియా ద్వారా క్రిస్మస్ విషెస్ తెలియజేస్తున్నారు. ఈక్రమంలోనే నాని కూడా విషెస్ తెలియజేస్తూ తన కొడుకు అర్జున్ తనకి చెప్పిన విషెస్ ని షేర్ చేశారు. అర్జున్ తన నాన్నకి క్రిస్మస్ విషెస్ తెలియజేస్తూ ఒక లెటర్ రాసి ఇచ్చాడు. “డియర్ నాన్న మెర్రి క్రిస్మస్. నువ్వు చాలా కష్టపడతావు. చాలా ప్రేమని ఇస్తావు. నువ్వు నా తండ్రివి అయ్యినందుకు చాలా గర్వపడుతున్నాను” అంటూ రాసుకొచ్చాడు.

అలాగే ఈ లెటర్ లో క్రిస్మస్ ట్రీ, శాంటా బొమ్మలు కూడా వేశాడు అర్జున్. ఇక ఈ లెటర్ ని నాని తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. “ఇంతకన్నా గొప్ప బహుమతి మరొకటి ఉండదు” అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ లెటర్ నెట్టింట వైరల్ అవుతుంది.

Also read : Roshan Kanakala : ‘బబుల్ గమ్’ ప్రీరిలీజ్ ఈవెంట్‌లో రోషన్ వ్యాఖ్యలకు.. ఎమోషనల్ అయిన సుమ..

ఇక నాని నటిస్తున్న సినిమాల విషయానికి వస్తే.. ‘అంటే సుందరానికి’ డైరెక్ట్ చేసిన వివేక్ ఆత్రేయతో నాని మరోసారి కలిసి చేస్తున్న సినిమా ‘సరిపోదా శనివారం’. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రం ఆల్రెడీ షూటింగ్ కూడా మొదలు పెట్టుకుంది. ప్రియాంక మోహన్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తుంటే ఎస్ జె సూర్య విలన్ గా కనిపించబోతున్నారు. ఈ సినిమా అనౌన్స్ చేస్తూ రిలీజ్ చేసిన టీజర్ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంది.

అలాగే రీసెంట్ గా ‘బలగం’తో సూపర్ హిట్టు అందుకున్న దర్శకుడు వేణుతో కూడా నాని ఓ సినిమా చేయడానికి సిద్దమైనట్లు తెలుస్తుంది. స్టోరీ కూడా ఓకే అయ్యినట్లు, ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్స్ జరుగుతున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ మూవీ అఫీషియల్ గా ప్రకటించనున్నారట.