Roshan Kanakala : ‘బబుల్ గమ్’ ప్రీరిలీజ్ ఈవెంట్‌లో రోషన్ వ్యాఖ్యలకు.. ఎమోషనల్ అయిన సుమ..
'బబుల్ గమ్' ప్రీరిలీజ్ ఈవెంట్‌లో కొడుకు రోషన్ మాట్లాడిన మాటలకు సుమ ఎమోషనల్ అయ్యారు.

Anchor Suma emotional for Roshan Kanakala speech at Bubblegum pre release event
Roshan Kanakala : టాలీవుడ్ యాంకర్ సుమ తనయుడు రోషన్ కనకాల హీరోగా ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఆల్రెడీ గతంలో ‘నిర్మల కాన్వెంట్’ అనే సినిమాలో ఒక ముఖ్య పాత్ర చేసిన రోషన్.. ఇప్పుడు ‘బబుల్ గమ్’ మూవీతో హీరోగా డెబ్యూట్ ఇస్తున్నాడు. కాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ ఆదివారం గ్రాండ్ గా జరిగింది. ఈ ఈవెంట్ కి అడివి శేష్, విశ్వక్ సేన్, సిద్దు జొన్నలగడ్డ అతిథులుగా వచ్చారు.
ఇక ఈ ఈవెంట్ లో రోషన్ మాట్లాడుతూ..
“నా కలర్ గురించి నా వెనక మాట్లాడడం, దాని మీద కామెంట్స్ రాయడం చాలానే చూశాను. వీడు హీరోనా, ఇంత నల్లగా ఉన్నాడు వీడు హీరో ఏంటిరా, వీడు హీరో మెటీరియల్ కాదు అంటూ చాలా మంది నా ముందే మాట్లాడారు. నేను ఇలానే పుట్టాను, ఇలానే ఉంటాను. ఒక మనిషికి కలర్ ఇంపార్టెంట్ కాదు బ్రదర్. ఒక మనిషికి కృషి, పట్టుదల, నిబద్ధత ఎంతో ముఖ్యమైనవి. అవే మనిషి సక్సెస్ ని డిసైడ్ చేస్తాయి.
Also read : Shruti Haasan : ఐరన్ లెగ్ నుంచి లక్కీ హీరోయిన్.. ప్లాప్‌ల్లో ఉన్న హీరోకి సక్సెస్..
మన తలరాతలో ఏం రాసి ఉందో అనేది ఎవరికి తెలియదు. కానీ దానిని మన పట్టుదలతో మనకి నచ్చినట్లు మార్చుకుంటాము. ఒకరోజు వస్తుంది, ఆరోజు నా గురించి కూడా గట్టిగా వినిపిస్తుంది. చెవులు మూసుకున్నా వినబడుతుంది. ఇది రాసిపెట్టుకోండి” అంటూ తనని ట్రోల్ చేసేవారికి గట్టి సమాధానం ఇచ్చాడు రోషన్. ఇక వేదిక పై రోషన్ ఇలా మాట్లాడుతుంటే.. ఆ పక్కనే ఉన్న సుమ ఎమోషనల్ అయ్యి కన్నీళ్లు పెట్టుకుంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.
View this post on Instagram
కాగా ఈ మూవీని రవికాంత్ పేరెపు డైరెక్ట్ చేస్తున్నాడు. గతంలో ఈ దర్శకుడు.. క్షణం, కృష్ణ అండ్ హిస్ లీల వంటి సూపర్ హిట్ సినిమాలు తెరకెక్కించాడు. ఇక ఈ రెండు సినిమాలకు సంగీతం అందించిన శ్రీచరణ్ పాకాల ఈ మూవీకి మ్యూజిక్ అందిస్తున్నాడు. మానస చౌదరి ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాని ఆడియన్స్ ముందుకు తీసుకు వస్తుంది. డిసెంబర్ 29న న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో ఈ మూవీని రిలీజ్ కాబోతుంది.