Shruti Haasan : ఐరన్ లెగ్ నుంచి లక్కీ హీరోయిన్.. ప్లాప్‌ల్లో ఉన్న హీరోకి సక్సెస్..
ఒకప్పుడు ఐరన్ లెగ్ అనిపించుకున్న శ్రుతిహాసన్.. ఇప్పుడు హీరోల లక్కీ హీరోయిన్ అనిపించుకుంటున్నారు. ప్లాప్ ల్లో ఉన్న హీరోలకు సక్సెస్ లు ఇచ్చి, వారి కమ్‌బ్యాక్ లో తాను భాగం అవుతున్నారు. ఇంతకీ ఆ హీరోలు ఎవరు..? ఆ సినిమాలు ఏంటి..?

Shruti Haasan is to be lucky heroine for tollywood star heroes
Shruti Haasan : లోకనాయకుడు కమల్ హాసన్ వారసురాలిగా ఇండస్ట్రీకి పరిచయమైన శ్రుతిహాసన్.. బాలీవుడ్ మూవీతో నటిగా కెరీర్ ని స్టార్ట్ చేశారు. ఆ తరువాత తెలుగులో సిద్దార్థ్ సరసన ‘అనగనగ ఓ ధీరుడు’, ‘ఓ మై ఫ్రెండ్’ సినిమాలో నటించారు. తమిళంలో ‘త్రీ’, ‘సెవెంత్ సెన్స్’ సినిమాల్లో నటించారు. మొదటి సినిమా నుంచి ప్రతి చిత్రం ప్లాప్ అవుతూనే వస్తుంది. దీంతో శ్రుతిహాసన్ పై ఐరన్ లెగ్ అనే ముద్ర పడింది.
అలంటి సమయంలో పవన్ కళ్యాణ్ సరసన ‘గబ్బర్ సింగ్’లో నటించి బ్లాక్ బస్టర్ అందుకున్నారు. అక్కడి నుంచి వరుస హిట్స్ అందుకుంటూ టాప్ హీరోయిన్ గా మారిపోయారు. ఇక ఒకప్పుడు ఐరన్ లెగ్ అనిపించుకున్న శ్రుతిహాసన్.. ఇప్పుడు హీరోల లక్కీ హీరోయిన్ అనిపించుకుంటున్నారు. ప్లాప్ ల్లో ఉన్న హీరోలకు సక్సెస్ లు ఇచ్చి, వారి కమ్‌బ్యాక్ లో తాను భాగం అవుతున్నారు. ఇంతకీ ఆ హీరోలు ఎవరు..? ఆ సినిమాలు ఏంటి..?
పాలిటిక్స్ లో ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ కమ్‌బ్యాక్ ఇస్తూ చేసిన సినిమా ‘వకీల్ సాబ్’. ఈ సినిమాలో శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటించారు. ఈ సినిమాకి ముందు పవన్ కళ్యాణ్ ప్లాప్ ల్లో ఉన్నారు. వకీల్ సాబ్‌తో అటు పాలిటిక్స్ నుంచి ఇటు ప్లాప్స్ నుంచి రీ ఎంట్రీ ఇచ్చినట్లు అయ్యింది.
Also read : Allu Arjun : ఆ నిర్మాత తనకి రెమ్యూనరేషన్ ఇవ్వలేదంటూ అల్లు అర్జున్ పోస్ట్.. అసలేమైంది..?
ఇక 2017లో వచ్చిన ‘రాజా ది గ్రేట్’ సినిమా తరువాత ఒక హిట్టు లేక బాధ పడుతున్న రవితేజకి కూడా ‘క్రాక్’ సినిమాతో శ్రుతి హిట్టుని అందించారు. రవితేజకి మాత్రమే కాదు ప్లాప్ ల్లో ఉన్న దర్శకుడు గోపీచంద్ మలినేని కూడా ఈ చిత్రంతో మంచి కమ్‌బ్యాక్ వచ్చింది.
సైరా, ఆచార్య, గాడ్‌ఫాదర్ చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ నిరాశ పరుస్తూ వచ్చిన చిరంజీవికి ‘వాల్తేరు వీరయ్య’తో ఈ ఏడాది విజయం వచ్చింది. ఈ సినిమాలో శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటించారు. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ చిత్రం బిగ్గెస్ట్ హిట్టుగా నిలిచి చిరు కెరీర్ లో హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది.
ఇక బాహుబలి తరువాత ఒక్క హిట్ లేని ఇబ్బంది పడుతున్న ప్రభాస్‌కి.. ఈ ఏడాది సలార్ తో భారీ విజయం వచ్చింది. ఈ చిత్రంలో కూడా శ్రుతిహాసనే హీరోయిన్ గా నటించారు. ప్రస్తుతం ఈ మూవీ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తుంది. ఇలా స్టార్స్ అందరి కమ్‌బ్యాక్ శ్రుతిహాసన్ భాగమయ్యి లక్కీ హీరోయిన్ అయ్యిపోయారు.