Allu Arjun : ఆ నిర్మాత తనకి రెమ్యూనరేషన్ ఇవ్వలేదంటూ అల్లు అర్జున్ పోస్ట్.. అసలేమైంది..?

అల్లు అర్జున్ చేసిన ఓ సినిమాకి ఓ ప్రముఖ నిర్మాత పారితోషకం ఇవ్వలేదట. ఈ విషయం తెలియజేస్తూ అల్లు అర్జున్ స్వయంగా ఓ పోస్ట్ వేశారు. ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో..

Allu Arjun : ఆ నిర్మాత తనకి రెమ్యూనరేషన్ ఇవ్వలేదంటూ అల్లు అర్జున్ పోస్ట్.. అసలేమైంది..?

Allu Arjun intagram post about producer who didnt pay remuneration for him

Updated On : December 24, 2023 / 5:14 PM IST

Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. పుష్ప సినిమాతో ఇండియా వైడ్ ఎంతో ఫేమ్ ని సంపాదించుకున్నారు. ఆయనతో సినిమాలు చేసేందుకు టాలీవుడ్ టు బాలీవుడ్ నిర్మాతలు ఎంత పారితోషకమైనా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. అల్లు అర్జున్ ఓకే అంటే.. భారీ అడ్వాన్స్ ని ముందుగానే ఇచ్చేందుకు రెడీగా ఉన్నారు.

అలాంటిది అల్లు అర్జున్ చేసిన ఓ సినిమాకి ఓ ప్రముఖ నిర్మాత పారితోషకం ఇవ్వలేదట. ఈ విషయం తెలియజేస్తూ అల్లు అర్జున్ స్వయంగా ఓ పోస్ట్ వేశారు. ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో.. “ఆ నిర్మాత ఫోటో షేర్ చేస్తూ తనకి అతను పారితోషకం ఇవ్వలేదని” రాసుకొచ్చారు. ఇంతకీ ఆ నిర్మాత ఎవరు..? పారితోషకం ఇవ్వని ఆ సినిమా ఏంటి..?

అల్లు అర్జున్ ‘గంగోత్రి’ సినిమాతో ఎంట్రీ ఇచ్చారని అందరికి తెలుసు. కానీ, ఆ చిత్రం కంటే ముందు అల్లు అర్జున్ వెండితెరపై కనిపించారు. ఈ మాట చెప్పగానే అందరికి చిరంజీవి నటించిన ‘డాడీ’ గుర్తుకు వస్తుంది. కానీ ఆ సినిమా కంటే ముందే బన్నీ మరో మూవీలో కనిపించారు. అది కూడా చిరంజీవి నటించిన సినిమా కావడమే విశేషం. చిరంజీవి హీరోగా 1985లో తెరకెక్కిన ‘విజేత’ సినిమా అందరికి గుర్తుకు ఉండే ఉంటుంది.

Also read : Ravi Basrur : సలార్ మ్యూజిక్ డైరెక్టర్ అసలు పేరేంటో తెలుసా..? ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా..?

ఆ మూవీలో అల్లు అర్జున్ చైల్డ్ ఆర్టిస్ట్ గా ఒక సీన్ లో కనిపిస్తారు. చిరంజీవి సిస్టర్ కొడుకుగా అల్లు అర్జున్ కనిపిస్తారు. బన్నీ నటించిన మొదటి మూవీ అదే. ఆ చిత్రాన్ని అల్లు అరవింద్ నిర్మించారు. ఆ మూవీ 100 డేస్ షీల్డ్ ని అల్లు అర్జున్ తన ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేస్తూ.. “నా మొదటి మూవీ విజేత. నా ప్రొడ్యూసర్ మా నాన్న. ఇన్నాళ్ల తరువాత నేను గ్రహించింది ఏంటంటే.. ఈ చిత్రానికి నాకు రెమ్యూనరేషన్ ఇవ్వలేదు” అంటూ సరదాగా రాసుకొచ్చారు.

ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ అవుతుంది. కాగా అల్లు అర్జున్ ఈ చిత్రం తరువాత కమల్ హాసన్ ‘స్వాతిముత్యం’లో కూడా చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించారు. ఆ తరువాత టీనేజ్ టైంలో డాడీ మూవీలో కనిపించారు. రెండేళ్ల తరువాత గంగోత్రితో హీరోగా ఎంట్రీ ఇచ్చారు.