Ravi Basrur : సలార్ మ్యూజిక్ డైరెక్టర్ అసలు పేరేంటో తెలుసా..? ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా..?
సలార్ మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్ అసలు పేరేంటో మీకు తెలుసా.? అతనికి రవి బస్రూర్ అనే పేరు ఎలా వచ్చిందో తెలుసా.? ఈ విషయాలని రీసెంట్ గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో రవి బస్రూర్ చెప్పుకొచ్చారు.

Salaar Movie music director Ravi Basrur real name story
Ravi Basrur : ప్రభాస్, పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రల్లో రెండు భాగాలుగా రూపొందుతున్న చిత్రం ‘సలార్’. ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీకి రవి బస్రూర్ సంగీతం అందించారు. ఈ మ్యూజిక్ డైరెక్టర్ కేజీఎఫ్ చిత్రాన్ని తన నేపథ్య సంగీతంతో ఓ రేంజ్ ఎలివేట్ చేసి.. ఆ మూవీ సక్సెస్ లో మేజర్ పార్ట్ పోషించారు. ఇప్పుడు సలార్ కి కూడా అదే విధంగా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇచ్చి ఆకట్టుకుంటున్నారు.
కాగా రవి బస్రూర్ అసలు పేరేంటో మీకు తెలుసా.? అతనికి రవి బస్రూర్ అనే పేరు ఎలా వచ్చిందో తెలుసా.? ఈ విషయాలని రీసెంట్ గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో రవి బస్రూర్ చెప్పుకొచ్చారు. ఈ మ్యూజిక్ డైరెక్టర్ అసలు పేరు ‘కిరణ్’. కెరీర్ స్టార్టింగ్ సినిమా అవకాశాల కోసం తీరుతున్న సమయంలో ఆలయాల్లో ప్రసాదాలు తింటూ జీవనం సాగించేవారట. మూడేళ్లు అయినా ఏ అవకాశం రాలేదు. అయితే ఈలోపు సరైన తిండి లేక బాగా బరువు తగ్గి సన్నబడిపోయారట.
Also read : Salaar Collections : బాక్సాఫీస్‌పై డైనోసార్ దాడి.. రెండు రోజుల్లో ఇన్ని కోట్లా..?
అలా ఉన్న రవి బస్రూర్‌ని అతని అన్నయ్య స్నేహితుడు కామత్ చూసి.. ఉద్యోగం ఇప్పిస్తానంటూ బంగారం వ్యాపారి అయిన ‘రవి’ వద్దకి తీసుకెళ్లారట. అయితే ఆ బంగారు వ్యాపారి.. ఉద్యోగం ఇవ్వకుండా కీబోర్డు కొనేందుకు 35వేలు డబ్బుని ఇచ్చారట. ఆ డబ్బుని ఇస్తూ.. “నువ్వేదైనా సాధించాక ఆ డబ్బుని తిరిగివ్వుమని” చెప్పారట. ఆయన మంచితనానికి రవి బస్రూర్ తన మనసులో గుడి కట్టేసుకున్నారు.
ఇక అలా మొదలైన రవి బస్రూర్ కెరీర్.. బిగ్ సిటీ ఎఫ్ఎం సంస్థలో జింగిల్స్ సృష్టికర్తల్లో ఒకడిగా చేరారు. ఇక అక్కడ మంచి గుర్తింపు లభించింది. ఏడాదిలోనే రాష్ట్రసాయి అవార్డుని అందుకున్నారు. ఆ అవార్డుతో సినిమాల్లో అవకాశాలు రావడం మొదలయ్యాయి. ప్రోగ్రామర్‌గా 64 చిత్రాలకు పని చేసిన తరువాత ప్రశాంత్ నీల్ అవ్వడం, ‘ఉగ్రం’ సినిమాకి సంగీత దర్శకుడిగా అవకాశం ఇవ్వడం జరిగింది.
రవి బస్రూర్ ఆ సినిమాకి ఇచ్చిన అడ్వాన్స్ ని పట్టుకొని.. తనని నమ్మి తనకి డబ్బుని ఇచ్చిన బంగార వ్యాపారి రవి దగ్గరకి వెళ్లారట. ఆ డబ్బుని ఆయనకి ఇస్తే.. ఆయన తీసుకోకుండా, “నువ్వూ కూడా మరొకరికి ఇలాంటి సహాయం చేసే స్థాయికి ఎదగాలి కిరణ్” అంటూ ఆశీర్వదించారట. ఇక ఆ బంగారు వ్యాపారి మంచితనానికి ముగ్దుడైన రవి బస్రూర్.. ఆయనకి ఎలాగైనా కృతజ్ఞత చెప్పుకోవాలని నిర్ణయించుకొని కిరణ్ అన్న తన పేరుని వదులుకొని రవి బసూరుగా మారారు.