Salaar Collections : బాక్సాఫీస్‌పై డైనోసార్ దాడి.. రెండు రోజుల్లో ఇన్ని కోట్లా..?
బాక్సాఫీస్‌పై డైనోసార్ దాడి మాములుగా లేదుగా. రెండు రోజుల్లో ఇన్ని కోట్ల కలెక్షన్స్.

Prabhas Prashanth Neel Salaar Part 1 Second day Collections report
Salaar Collections : ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రెండు భాగాలుగా రూపొందుతున్న చిత్రం ‘సలార్’. ఈ చిత్రం మొదటి భాగం భారీ అంచనాలు మధ్య పాన్ ఇండియా వైడ్ ఈ శుక్రవారం గ్రాండ్ గా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఇక చాలా కాలం తరువాత ప్రభాస్ నుంచి ఒక మాస్ బొమ్మ రావడం, దానికి ప్రశాంత్ నీల్ ఎలివేషన్స్ తోడవ్వడంతో.. బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్స్ సునామీ మొదలైంది.
ఈ చిత్రం మొదటిరోజే వరల్డ్ వైడ్ గా దాదాపు రూ.178 కోట్లకు పై గ్రాస్‌ని అందుకొని సంచలనం సృష్టించింది. ఇక రెండో రోజు కూడా 100 కోట్లకు పైగా కలెక్షన్స్ అందుకొని ప్రభంజనం సృష్టిస్తుంది. శనివారం నాడు ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం దాదాపు 117 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ ని రాబట్టింది. అంటే రెండు రోజుల్లో ఈ చిత్రం 295 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ ని రాబట్టింది. దీనిబట్టి చూస్తే షేర్ కలెక్షన్స్ సుమారు 140 కోట్ల వరకు ఉంటుంది.
కాగా వరల్డ్ వైడ్ గా ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ 350 కోట్ల వరకు జరిగినట్లు చెబుతున్నారు. అంటే ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలంటే.. 350 కోట్లకు పైగా షేర్ కలెక్షన్స్, 700 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ ని రాబట్టాలి. ప్రస్తుతం బాక్స్ ఆఫీస్ వద్ద సలార్ జోరు చూస్తుంటే.. ఆదివారం నాడే ఆల్మోస్ట్ నాలుగు వందల కోట్లు రాబట్టేసేలా ఉంది. ఇక కలెక్షన్స్ సునామీ చూసి బాలీవుడ్ కి మళ్ళీ టెన్షన్ పట్టుకుంది.
Also read : Salaar Affect : PVRపై సలార్ రిలీజ్ ఎఫెక్ట్.. దారుణంగా పడిపోయిన షేర్లు
??? ??????? ?????? ??????…??#SalaarCeaseFire dominates the global-box office, crossing ???.? ?????? ???? (worldwide) ?? ? ????!#BlockbusterSalaar #RecordBreakingSalaar #SalaarRulingBoxOffice#Salaar #Prabhas #PrashanthNeel… pic.twitter.com/suEQftytyj
— Salaar (@SalaarTheSaga) December 24, 2023
ఈ ఏడాది బాలీవుడ్ నుంచి వచ్చిన షారుఖ్ ఖాన్, రణబీర్ కపూర్ సినిమాలు ఇండియా వైడ్ భారీ ఓపెనింగ్స్ సాధించాయి. మొదటిరోజు పఠాన్ 106 కోట్ల గ్రాస్, జవాన్ 129 కోట్ల గ్రాస్, యానిమల్ 116 కోట్ల గ్రాస్ ని అందుకున్నాయి. అయితే ఇప్పుడు ప్రభాస్ మూవీ సలార్.. బాలీవుడ్ స్టార్స్ సినిమాల మించి కలెక్షన్స్ అందుకొని సంచలనం సృష్టిస్తుంది.
అంతేకాదు ఈ చిత్రాలు ఈ ఏడాది అతి కష్టం మీద 1000 కోట్ల మార్క్ వరకు చేరుకొని ఇండియన్ టాప్ గ్రాసర్స్ గా నిలిచాయి. ఇప్పుడు ప్రభాస్ తన సినిమాతో వాళ్ళ కలెక్షన్స్ ని బీట్ చేసి.. ఈ ఏడాది నెంబర్ వన్ పొజిషన్ ని సొంతం చేసుకోవడం ఖాయంగా కనిపిస్తుంది. అందుకనే బాలీవుడ్ హీరోలకు టెన్షన్ పట్టుకుంది.