Hi Nanna star Nani once again commented about National awards Allu Arjun
Nani : నేచురల్ స్టార్ నాని.. ఈ ఏడాది నేషనల్ అవార్డులు ప్రకటించిన సమయంలో చేసిన ఒక పోస్ట్ టాలీవుడ్ హాట్ టాపిక్ అయ్యింది. తెలుగు ఇండస్ట్రీకి ఒక తీరని కలలా ఉన్న బెస్ట్ యాక్టర్ అవార్డుని అల్లు అర్జున్ అందుకొని తెలుగు వారికీ గౌరవం తీసుకువచ్చినందుకు అందరూ అభినందించారు. అలాంటి సంతోష సమయంలో నాని.. తమిళ్ హీరో సూర్య నటించిన ‘జై భీమ్’కి అవార్డు ఇవ్వలేదని బాధ వ్యక్తం చేస్తూ పోస్టు పెట్టారు.
ఈ పోస్టు విషయంలో నాని టాలీవుడ్ అభిమానులు నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు.ఈ విషయం పై నాని మరోసారి వైరల్ కామెంట్స్ చేశారు. ఒక మీడియా సమ్మిట్ లో పాల్గొన్న నానిని.. ఈ కాంట్రవర్సీ గురించి ప్రశ్నించారు. ఆ పోస్ట్ వెనుక ఉన్న కారణం ఏంటని ప్రశ్నించారు.
Also read : Naga Chaitanya : మనం థియేటర్ ఫెస్టివల్‌కి ఆహ్వానం పలుకుతున్న నాగచైతన్య..
దానికి నాని బదులిస్తూ.. “నా తెలుగు సినిమాకి ఈ ఏడాది అధికంగా నేషనల్ అవార్డులు వచ్చినందుకు నేను చాలా సంతోష పడ్డాను. అలాగే నా బ్రదర్ అల్లు అర్జున్ టాలీవుడ్ కి మొదటి నేషనల్ అవార్డు తీసుకు రావడం పట్ల కూడా ఎంతో గర్వంగా ఫీల్ అయ్యాను. అయితే జై భీమ్ సినిమాకి కూడా ఏదో ఒక క్యాటగిరిలో అవార్డు వస్తే బాగుండు అని ఫీల్ అయ్యాను.
మీకు అర్ధమయ్యేలా చెప్పాలంటే.. నా సిస్టర్ మంచి ర్యాంక్ తో పాస్ అయ్యింది. కానీ నా కజిన్ మంచి ర్యాంక్ సంపాదించలేకపోయాడు. అప్పుడు నేను నా సిస్టర్ కోసం ఆనంద పడతాను. అలాగే నా కజిన్ కోసం బాధని ఫీల్ అవుతాను. అలా ఫీల్ అయ్యే నేను పోస్టు వేశాను. కానీ దానిని మీడియా వాళ్లంతా వేరుగా రాసేశారు. నేషనల్ అవార్డుల పై నాని అసహనం వ్యక్తం చేశారు. అల్లు అర్జున్ కి రావడం ఇష్టం లేదు అన్నట్లు చూపించారు” అంటూ చెప్పుకొచ్చాడు.