ఎన్నికల టైంలో సినిమాలు విడుదల చేయొద్దు అంటూ దాఖలు అయిన పిటిషన్లను కొట్టివేసింది హైకోర్టు. లక్ష్మీస్ ఎన్టీఆర్, ‘లక్ష్మీస్ వీరగ్రంథం’ సినిమాల విడుదలను ఆపాలని లంచ్ మోషన్ పిటిషన్ దాఖలైంది. సత్యనారాయణ అనే వ్యక్తి కోర్టుకెక్కారు. మార్చి 19వ తేదీ బుధవారం కోర్టు ఈ రెండు సినిమాలపై దాఖలైన పిటీషన్లను విచారించింది. పిటీషనర్ వాదనను కోర్టు తోసిపుచ్చింది. ప్రతి వ్యక్తికి భావ ప్రకటన స్వేచ్ఛ ఉంటుందని వ్యాఖ్యానించింది. సినిమా విడుదలను ఆపాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రానికి రాంగోపాల్ వర్మ, లక్ష్మీస్ వీరగ్రంథం సినిమాకు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి దర్శకత్వం వహించారు.
Read Also : శ్రీ దేవి బయోపిక్ లో బాలీవుడ్ హీరోయిన్!
రాంగోపాల్వ వర్మ దర్శకత్వం వహించిన లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాపై తెలుగు తమ్ముళ్లు గుస్సాగా ఉన్నారు. బాబును విలన్‌గా చూపించారంటూ దుమ్మెత్తిపోస్తున్నారు. ఎన్నికల సమయంలో సినిమా విడుదలైతే ఎలాంటి ప్రభావం ఉంటుందో అని టెన్షన్ పడుతున్నారు. హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వటంతో.. సెన్సార్ సర్టిఫికేషన్ కష్టం కాదు అంటోంది యూనిట్. మార్చి 29న సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది.
హైకోర్టు తీర్పుపై వర్మ ట్విట్టర్‌లో స్పందించారు. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా విడుదలను ఆపాలని వేసిన పిటిషన్ కొట్టివేసిన టీఎస్ హైకోర్టు. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్ విడుదలను ఆపాలని’.. ఎన్నికల సమయంలో విడుదల చేస్తే ఏపీలో శాంతి భద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉందని దాఖలైన పిటిషన్ కొట్టివేసిన హైకోర్టు’. అంటూ వర్మ ట్వీట్ చేశారు.
ఇక లక్ష్మీస్ వీరగంథం మూవీ విడుదలకు కూడా లైన్ క్లియర్ అయ్యింది.
లక్ష్మిస్ ఎన్టీఆర్ సినిమా విడుదలను ఆపాలని వేసిన పిటిషన్ కొట్టివేసిన టీఎస్ హైకోర్టు.
లక్ష్మిస్ ఎన్టీఆర్ విడుదలను ఆపాలని ’..ఎన్నికల సమయంలో విడుదల చేస్తే ఏపీ లో శాంతి భద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉందని పిటిషన్ దాఖలు ..పిటిషన్ కొట్టివేసిన హైకోర్టు. #LakshmiNTR— Ram Gopal Varma (@RGVzoomin) March 19, 2019