NTR – Komalee Prasad : నేను ఎన్టీఆర్ కి హార్డ్ కోర్ ఫ్యాన్ ని.. మా నాన్న చనిపోయాక ఎన్టీఆర్ స్పీచ్ ఒకటి..

తాజాగా కోమలీ ప్రసాద్ ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చింది.

Actress Komalee Prasad Comments on NTR

NTR – Komalee Prasad : ఎన్టీఆర్ కి తెలుగు రాష్ట్రాల్లో అభిమానులు ఏ రేంజ్ లో ఉన్నారో తెలిసిందే. RRR సినిమాతో నేషనల్ వైడ్, బయటి దేశాల్లో కూడా అభిమానులను సంపాదించుకున్నాడు. తెలుగు నటీనటుల్లో కూడా చాలామంది ఎన్టీఆర్ అభిమానులు ఉన్నారు. తాజాగా నటి కోమలీ ప్రసాద్ కూడా నేను ఎన్టీఆర్ కి హార్డ్ కోర్ ఫ్యాన్ అని తెలిపింది.

కోమలీ ప్రసాద్ నెపోలియన్, హిట్ 2, హిట్ 3, టచ్ మీ నాట్, లూజర్.. లాంటి పలు సినిమాలు, సిరీస్ లతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇటీవల వచ్చిన నాని హిట్ 3లో కూడా పోలీస్ ఆఫీసర్ గా యాక్షన్స్ తో కూడా అదరగొట్టింది. తాజాగా కోమలీ ప్రసాద్ ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చింది.

Also Read : Mangli – Mukesh Ambani : ముకేశ్ అంబానీతో సింగర్ మంగ్లీ.. ఫోటో వైరల్.. ఎప్పుడు? ఎక్కడ కలిసిందో తెలుసా?

ఈ ఇంటర్వ్యూలో కోమలీ ప్రసాద్ మాట్లాడుతూ.. మా అమ్మమ్మ, తాతయ్య ఫ్యామిలీ అంతా సీనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్. అప్పట్లో మా తాతయ్య సీనియర్ ఎన్టీఆర్ ని కలిసి, ఫోటో దిగారు. అది గొప్పగా చెప్పేవాళ్లు. అలా ఫ్యామిలీ వల్ల చిన్నప్పట్నుంచి సీనియర్ ఎన్టీఆర్ అంటే ఇష్టం పెరిగింది. నేను ముంబైలో చదివాను. అక్కడ ఉన్నప్పుడు అంతగా తెలుగు సినిమాలు చూడలేదు. ఇక్కడికి వచ్చాక ఎన్టీఆర్ సినిమాలు చూడటం, ఎన్టీఆర్ ని ఫాలో అవ్వడం, ఆయన నచ్చడంతో హార్డ్ కోర్ ఫ్యాన్ గా మారిపోయాను. నేను సినిమాల్లోకి వచ్చేసరికే ఆయన స్టార్ హీరో. ఇక చిన్నప్పట్నుంచి కూడా ఎన్టీఆర్ ఫ్యామిలీ అంటూ పెరిగాను కాబట్టి అది కూడా తోడయింది. మా నాన్న చనిపోయాక ఎన్టీఆర్ గారి ఒక స్పీచ్ నాకు ఒక మోటివేషన్, కంఫర్ట్ ఇచ్చింది. ఆయనతో నటించే ఛాన్స్ వస్తే వదులుకోను అని తెలిపింది.

గతంలో కూడా కోమలీ ప్రసాద్ ఎన్టీఆర్ కి ఫ్యాన్ అని, ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టం అని తెలిపింది. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ కామెంట్స్ ని వైరల్ చేస్తున్నారు.

Also Read : Komalee Prasad : ఈ హిట్ 3 భామ కూడా డాక్టర్ అని తెలుసా? న్యూయార్క్ మాస్టర్స్ అప్లికేషన్ చింపేసి.. సినిమాల్లోకి వస్తా అంటే వాళ్ళ నాన్న..