Komalee Prasad : ఈ హిట్ 3 భామ కూడా డాక్టర్ అని తెలుసా? న్యూయార్క్ మాస్టర్స్ అప్లికేషన్ చింపేసి.. సినిమాల్లోకి వస్తా అంటే వాళ్ళ నాన్న..

తాజాగా కోమలీ ప్రసాద్ ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వగా తన స్టడీ, సినిమాల్లోకి ఎంట్రీ గురించి చెప్పుకొచ్చింది.

Komalee Prasad : ఈ హిట్ 3 భామ కూడా డాక్టర్ అని తెలుసా? న్యూయార్క్ మాస్టర్స్ అప్లికేషన్ చింపేసి.. సినిమాల్లోకి వస్తా అంటే వాళ్ళ నాన్న..

Do You Know about Hit 3 Actress Komalee Prasad is a Doctor

Updated On : May 7, 2025 / 4:18 PM IST

Komalee Prasad : మన సినీ పరిశ్రమలో కొంత మంది హీరోయిన్స్ డాక్టర్స్ అని తెలిసిందే. అలాంటి లిస్ట్ లో ఇంకో నటి కూడా చేరింది. హీరోయిన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వరుస సినిమాలు, సిరీస్ లు చేసుకుంటూ వెళ్తుంది కోమలీ ప్రసాద్. హిట్ 2లో పోలీసాఫీసర్ గా కనిపించిన కోమలీ ప్రసాద్ ఇటీవల వచ్చిన నాని హిట్ 3లో కూడా పోలీస్ ఆఫీసర్ గా కనిపించింది. హిట్ 3 సినిమాలో నానితో ఫైట్ కూడా చేసింది.

హిట్ 3 సినిమాతో కోమలీ ప్రసాద్ కి మరింత పేరు, ఫేమ్ వచ్చింది. తాజాగా కోమలీ ప్రసాద్ ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వగా తన స్టడీ, సినిమాల్లోకి ఎంట్రీ గురించి చెప్పుకొచ్చింది.

Also Read : Sree Vishnu : బాలీవుడ్ ఆఫర్స్ కి నో చెప్పిన శ్రీవిష్ణు.. పాపం.. శ్రీవిష్ణు డైలాగ్స్ కి వేరే భాష రైటర్లు ఇబ్బంది పడుతున్నారంట..

కోమలీ ప్రసాద్ తన గురించి చెప్తూ.. నేను డాక్టర్ చదివాను, నేను డెంటిస్ట్ ని. సినిమాల్లోకి వస్తాను అంటే మా నాన్న కాళ్ళు విరగ్గొడతాను అన్నాడు. డాక్టర్ సర్టిఫికెట్ ఉన్నాకే ఏదైనా చెయ్యి. చేతిలో డిగ్రీ ఉంటే సేఫ్ గా ఉంటుంది అని క్లారిటీగా చెప్పారు. అందుకే నేను సినీ పరిశ్రమలోకి లేట్ గా వచ్చాను. న్యూయార్క్ వెళ్లి మాస్టర్స్ చేద్దాం అనుకున్నాను. అప్పుడు ‘నేను సీత దేవి’ సినిమా ఛాన్స్ వచ్చింది. తెలిసిన ఫ్రెండ్స్ వాళ్ళ ద్వారా ఆ ఛాన్స్ వచ్చింది. నా సెకండ్ సినిమా డైరెక్టర్ ఆ సినిమాలో హీరో. చేయమని అడగడంతో ఛాన్స్ వచ్చిందని నా మాస్టర్స్ అప్లికేషన్ చింపేసి సినిమాల్లోకి వచ్చేసాను. నేను క్లాసికల్ డ్యాన్సర్ ని కూడా అని తెలిపింది.

ఇక కోమలీ ప్రసాద్ నెపోలియన్, హిట్, టచ్ మీ నాట్, లూజర్.. లాంటి పలు సినిమాలు, సిరీస్ లతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.

Also See : Express Hari : టీవీ ఆర్టిస్ట్, పటాస్ ఫేమ్ ఎక్స్‌ప్రెస్ హరి బర్త్ డే సెలబ్రేషన్స్.. ఫొటోలు చూశారా?