Sree Vishnu : బాలీవుడ్ ఆఫర్స్ కి నో చెప్పిన శ్రీవిష్ణు.. పాపం.. శ్రీవిష్ణు డైలాగ్స్ కి వేరే భాష రైటర్లు ఇబ్బంది పడుతున్నారంట..
మీరెందుకు పాన్ ఇండియా సినిమాలు చెయ్యట్లేదు, మీ సినిమాలు ఎందుకు వేరే భాషల్లోకి డబ్బింగ్ చెయ్యట్లేదు అని ప్రశ్నించగా శ్రీవిష్ణు ఆసక్తికర సమాధానం చెప్పారు.

Sree Vishnu Gives Clarity on why he Didn't do Pan India Movies
Sree Vishnu : ప్రస్తుతం తెలుగు హీరోల్లో మంచి సక్సెస్ లతో దూసుకుపోతున్న వారిలో శ్రీవిష్ణు ఒకరు. తనదైన ప్రత్యేక డైలాగ్ డెలివరీతో కామెడీ, ఫ్యామిలీ కంటెంట్ తో సామజవరగమన సినిమా నుంచి వరుస హిట్స్ కొడుతున్నాడు. శ్రీవిష్ణు ఇప్పుడు సింగిల్ సినిమాతో మే 9న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నేడు శ్రీవిష్ణు మీడియాతో మాట్లాడాడు.
ఈ క్రమంలో మీరెందుకు పాన్ ఇండియా సినిమాలు చెయ్యట్లేదు, మీ సినిమాలు ఎందుకు వేరే భాషల్లోకి డబ్బింగ్ చెయ్యట్లేదు అని ప్రశ్నించగా శ్రీవిష్ణు ఆసక్తికర సమాధానం చెప్పారు.
Also See : Rahasya Gorak : కిరణ్ అబ్బవరం భార్యకు సీమంతం.. రహస్య గోరఖ్ బేబీ బంప్ ఫోటోలు వైరల్..
శ్రీవిష్ణు మాట్లాడుతూ.. స్వాగ్ సినిమా తర్వాత నాకు నార్త్ నుంచి మంచి ఆఫర్స్ వచ్చాయి. పెద్ద నిర్మాణ సంస్థలే సినిమాలు చేద్దామని వచ్చారు. కానీ నేను నో చెప్పాను. నేను తెలుగు మీదే ఫోకస్ చేయాలి అనుకున్నాను. నా ఆడియన్స్, నా బలం ఇక్కడే ఉంది కాబట్టి ఇక్కడే ఎక్కువగా ఫోకస్ చేయాలి అనుకున్నాను. అలాగే నా సినిమాలని వేరే భాషల్లో డబ్బింగ్ చేద్దామని ట్రై చేశారు కానీ నా డైలాగ్ డెలివరీ డిఫరెంట్ గా ఉండటంతో అక్కడి రైటర్లు డైలాగ్స్ రాయలేకపోయారు అని నాకు చెప్పారు. గత సినిమాలు ట్రై చేశారు కానీ డబ్బింగ్ వర్కౌట్ అవ్వలేదు అని వదిలేసారు. నాకు వేరే భాషల ప్రేక్షకుల నుంచి కూడా బాగా చేశాను అని, సినిమా బాగుంది అని మెసేజ్ లు వస్తుంటాయి అని తెలిపారు. దీంతో శ్రీవిష్ణు పాన్ ఇండియా సినిమాలు చేయడు అని తెలుస్తుంది.