Allu Arjun – Pawan Kalyan : 21 ఏళ్ళ క్రితం అల్లు అర్జున్ కోసం వచ్చిన పవన్ కళ్యాణ్.. బన్నీ స్పెషల్ పోస్ట్ వైరల్..
ఆర్య సినిమా రిలీజ్ అయి నేటికి 21 ఏళ్ళు అయింది.

Pawan Kalyan and Prabhas Attends Allu Arjun Arya Movie Audio Function Arya Completed 21 Years
Allu Arjun – Pawan Kalyan : అల్లు అర్జున్ ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా దూసుకెళ్తున్న సంగతి తెలిసిందే. పుష్ప 2తో సరికొత్త రికార్డులు సృష్టించాడు. అల్లు అర్జున్ కెరీర్లో రెండో సినిమా ఆర్య పెద్ద హిట్ అయి స్పెషల్ ఫిలింగా నిలవడమే కాక అల్లు అర్జున్ ని హీరోగా నిలబెట్టింది. గత సంవత్సరం ఆర్య 20 ఏళ్ళ వేడుక కూడా గ్రాండ్ గా చేసారు.
ఆర్య సినిమా రిలీజ్ అయి నేటికి 21 ఏళ్ళు అయింది. అయితే ఆర్య సినిమా ఆడియో ఈవెంట్ కి అప్పట్లో పవన్ కళ్యాణ్, ప్రభాస్ గెస్టులుగా వచ్చారు. ఆర్య సినిమా ఆడియో ఈవెంట్లో మూవీ యూనిట్ తో పాటు ప్రభాస్, పవన్ కలిసి సందడి చేశారు. నేడు ఆర్య మెమరీస్ లో ఈ ఫోటోలు వైరల్ గా మారాయి.
Also Read : జగదేజ వీరుడు అతిలోక సుందరి రీ రిలీజ్ స్పెషల్ ఇంటర్వ్యూ.. ప్రోమో రిలీజ్.. బాస్ కామెడీ టైమింగ్ అదుర్స్..
ఇక ఆర్య రిలీజయి 21 ఏళ్ళు అవ్వడంతో అల్లు అర్జున్ అప్పటి వర్కింగ్ స్టిల్స్ షేర్ చేసి స్పెషల్ పోస్ట్ పెట్టాడు. అల్లు అర్జున్ తన ట్వీట్ లో.. ఆర్య కేవలం సినిమా మాత్రమే కాదు. నా లైఫ్ ని మార్చేసి కొత్త జర్నీని ఇచ్చింది. అప్పటి ప్రేమ, జ్ఞాపకాలు, మ్యాజిక్ ఇంకా పదిలంగా ఉన్నాయి అని తెలిపాడు. దీంతో బన్నీ ఫ్యాన్స్ ఆర్యని ట్రెండ్ చేస్తూ బన్నీ పోస్ట్ వైరల్ చేస్తున్నారు.
#Arya wasn’t just a film, It was the beginning of a journey that changed my life forever. Grateful for the love, the memories, and the magic that still lives on. 🖤 #21YearsForArya pic.twitter.com/RWm6WYRXbu
— Allu Arjun (@alluarjun) May 7, 2025
దిల్ రాజు నిర్మాణంలో సుకుమార్ డైరెక్టర్ గా అల్లు అర్జున్, శివబాలాజీ, అను మెహతా మెయిన్ లీడ్స్ లో ఆర్య సినిమా 2004 లో రిలీజయి భారీ విజయం సాధించింది. ఈ సినిమా సుకుమార్ కి మొదటి సినిమా. అప్పట్నుంచి సుక్కు – బన్నీ ఫ్రెండ్షిప్ కొనసాగుతుంది.
Also Read : Pawan Kalyan: ‘ఆపరేషన్ సిందూర్’పై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక కామెంట్స్..