క్యాన్సర్‌తో టీవీ నటుడు మృతి

Hollywood Actor Dustin Diamond dies:హాలీవుడ్ టీవీ నటుల్లో ఒకరైన ప్రముఖ యాక్టర్ డస్టిన్‌ డైమండ్‌ 44ఏళ్ల వయస్సలో చనిపోయారు. కొంతకాలంగా కణ క్యాన్సర్‌తో బాధపడుతూ ఉన్న డస్టిన్‌ ఫ్లోరిడాలోని ఆస్పత్రిలో కన్నుముశారు.

‘సెవ్డ్‌ బై ది బెల్’‌ సిరీయల్‌తో బాల నటుడుగా గుర్తింపు తెచ్చుకున్న డస్టిన్‌.. కణ క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు డస్టిన్ తండ్రి మార్క్‌ డైమండ్‌ వెల్లడించారు. స్టేజ్‌ 4 కణ క్యాన్సర్‌కు ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూ మరణించినట్లు ఆయన తండ్రి పేర్కొన్నారు.

1989 నుంచి 1992 మధ్యకాలంలో వచ్చిన ‘సెవ్డ్‌ బై ది బెల్‌’ సీరియల్‌లో డస్టీన్‌ బాల నటుడిగా అందరిని మెప్పించాడు. ఇందులో డస్టిన్‌ తన స్కెచ్‌ ప్రతిభతో మంచి గుర్తింపు పొందాడు. అప్పట్లో ప్రముఖ ఛానల్‌ ఎన్‌బీసీలో ఈ సిరీయల్‌ ఉదయాన్నే ప్రసారం అయ్యేది.