Paul Grant : సినీ పరిశ్రమలో మరో విషాదం.. కుప్పకూలిన ప్రముఖ నటుడు..
హ్యారీ పోటర్, స్టార్ వార్స్ లాంటి పలు సినిమాలతో మెప్పించిన నటుడు పాల్ గ్రాంట్ లండన్‌లోని యాస్టర్ రోడ్ సెయింట్ పాంక్రస్ స్టేషన్‌లో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఇది గమనించిన స్థానికులు ఆస్పత్రికి తరలించగా అప్పటికే.............
- Saketh U
- Published on- March 21, 2023 / 11:33 AM IST
Hollywood Actor Paul Grant Passes away at the age of 56
Paul Grant : ఇటీవల భాషకు సంబంధం లేకుండా అనేక సినీ పరిశ్రమలలో పలు విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. అనేక మంది ప్రముఖ నటులు ఇటీవల వరుసగా మరణించడంతో తీవ్ర విషాదం నెలకొంది. ఒకరి మరణం మరవకముందే మరో మరణంతో అభిమానులు, సినీ ప్రేమికులు బాధని వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ప్రముఖ హాలీవుడ్ నటుడు పాల్ గ్రాంట్ కన్నుమూశారు.
హ్యారీ పోటర్, స్టార్ వార్స్ లాంటి పలు సినిమాలతో మెప్పించిన నటుడు పాల్ గ్రాంట్ లండన్‌లోని యాస్టర్ రోడ్ సెయింట్ పాంక్రస్ స్టేషన్‌లో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఇది గమనించిన స్థానికులు ఆస్పత్రికి తరలించగా అప్పటికే అతను మరణించాడని వైద్యులు తెలిపారు. పాల్ గ్రాంట్ అనేక బ్రిటిష్, హాలీవుడ్ సినిమాల్లో నటించి మెప్పించాడు. అతనికి స్పాండిలోపిఫిసిల్ డైస్పాల్షియా కాంజెనిటల్ అనే అరుదైన జెనిటిక్ డిజార్డర్ ఉండటంతో మరుగుజ్జులాగే ఉండిపోయాడు. అయితే సినిమాల పరంగా ఇది తనకు కలిసి వచ్చింది. అతనికి భార్య, ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు.
Naatu Naatu : టెస్లా కారుల ‘నాటు నాటు’ ఆటకి ఎలాన్ మస్క్ రిప్లై.. RRR రేంజ్ మాములుగా లేదుగా!
గత కొన్నాళ్లుగా పాల్ గ్రాంట్ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. ఇదే సమయంలో ముందుకు బానిస అయ్యాడు. గతంలో ఓ సారి కొకైన్ తీసుకుంటూ పోలీసులకు రెడ్ హ్యాండెడ్ గా కూడా దొరికాడు పాల్. ఇప్పుడు అనారోగ్య సమస్యలతోనే 56 ఏళ్ళ వయసులో అలా సడెన్ గా కుప్పకూలిపోయి పడిపోయి మరణించాడని సమాచారం. పాల్ గ్రాంట్ పై పలువురు హాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.
