Hollywood Game of Thrones Actor Darren kent Passed away
Darren Kent : ఇటీవల సినీ పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. పలువురు ప్రముఖుల కన్నుమూతతో విషాదం నెలకొంటుంది. తాజాగా హాలీవుడ్ సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. ప్రముఖ హాలీవుడ్ నటుడు డారెన్ కెంట్ 36 ఏళ్ళ వయసులోనే కన్నుమూశారు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఆగస్టు 11న మరణించినట్టు తాజాగా హాలీవుడ్ ట్యాలెంట్ ఏజెన్సీ వెల్లడించింది.
‘Game of Thrones’ సిరీస్ ద్వారా కెంట్ ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకున్నారు. అనేక HBO డ్రామా సిరీసుల్లోనూ నటించారు. 2008లో మిర్రర్స్ అనే చిత్రంతో సినిమాల్లోకి అడుగుపెట్టారు. కొంచెం హైట్ తక్కువగా ఉండే కెంట్ కి స్కిన్ కి సంబంధించిన ఒక రేర్ డిసీస్ కూడా ఉంది. అతని మీద సూర్య కిరణాలు పడకూడదు. సూర్యుడిని అతని శరీరం తట్టుకోలేదు. దీనివల్ల అతను అనేక ఇబ్బందులు పడ్డాడు. అయినా తన నటనతో పలు హాలీవుడ్ సినిమాల్లో మెప్పించాడు. సన్నీబాయ్ సినిమాకు గాను కెంట్ బెస్ట్ యాక్టర్ అవార్డుని కూడా అందుకున్నారు.
కెంట్ మరణంతో హాలీవుడ్ లో విషాదం నెలకొంది. ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో పలువురు హాలీవుడ్ ప్రముఖులు కెంట్ కి నివాళులు అర్పిస్తూ సంతాపం తెలియచేస్తున్నారు.