Hollywood technicians are working for tollywood movie Nee Dhare Nee Katha
Nee Dhare Nee Katha : కొత్త టాలెంట్ తో టాలీవుడ్ పరిశ్రమ ప్రస్తుతం ఇండియాలో నెంబర్ వన్ ఇండస్ట్రీగా అనిపించుకుంటుంది. ప్రస్తుతం వస్తున్న కొత్త దర్శకులు తమ టాలెంట్ తో చిన్న బడ్జెట్ లోనే అద్భుతాలు సృష్టిస్తూ అందర్నీ ఆకర్షిస్తున్నారు. ఆ టాలెంట్ తో ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో తమదైన ముద్ర వేస్తున్నారు. ఇప్పుడు ‘నీదారే నీకథ’ సినిమాతో ఆడియన్స్ ముందుకు రాబోతున్న దర్శకుడు వంశి జొన్నలగడ్డ కూడా ఆ కోవకు చెందినవారే.
న్యూయార్క్ ఫిలిం అకాడమీలో ఫిలిం మేకింగ్ పై ట్రైనింగ్ అయిన వంశీ జొన్నలగడ్డ.. లోకల్ టాలెంట్‌ని ఇంటర్నేషనల్ లెవెల్ కి తీసుకు వెళ్లేలా ‘నీదారే నీకథ’ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఈక్రమంలోనే ఈ చిత్రానికి హాలీవుడ్ టెక్నీషియన్స్ ని ఎంపిక చేసుకున్నారు. హాలీవుడ్ చిత్రాలకు సంగీతం రికార్డింగ్ చేసిన ఇటాలియన్ మ్యూజిక్ కంపోజర్ ‘ఆల్ బర్ట్’ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు.
Also read : Koratala Siva : ఏడేళ్లుగా ‘శ్రీమంతుడు’ రచ్చ.. సుప్రీంకోర్టులో కూడా కొరటాల శివకు చుక్కెదురు..
హాలీవుడ్ బుడాపెస్ట్ స్కోరింగ్ ఆర్కెస్ట్రా ద్వారా మ్యూజిక్ చేయబడిన ఫస్ట్ ఇండియన్ మూవీగా ‘నీదారే నీకథ’ నిలిచింది. ఇక ఈ మూవీకి సినిమాట్రోగ్రాపర్ గా కూడా హాలీవుడ్ టెక్నీషియన్ నే ఎంపిక చేసుకున్నారు. ‘అలెక్స్ క ఓ’ తన విజువల్ వండర్స్ తో ఈ సినిమాని అద్భుతంగా చూపించబోతున్నారు. ఇక ఈ మూవీకి మురళి మరియు వంశీ జొన్నలగడ్డ అందమైన కథని రచించారు.
జె.వి ప్రొడక్షన్స్ పతాకం పై శైలజ జొన్నలగడ్డ, వంశి జొన్నలగడ్డ, హర్షిత తోట, తేజేష్ వీర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రీసెంట్ గా హైదరాబాదులోని నెక్సస్ మాల్ లో ఈ మూవీ యూనిట్ పరిచయ కార్యక్రమం జరగగా.. ఏఆర్ రెహమాన్ ఫౌండేషన్ ద్వారా 30 మంది యువ సంగీత వాయిద్య కళాకారులు లైవ్ ఆర్కెస్ట్రాతో మ్యూజికల్ ఫ్లాష్ మాబ్ ఇచ్చి అందర్నీ ఉర్రూతలూగించారు.
Nee Dhare Nee Katha