Burra Sai Madhav : ప్రముఖ సినీ రచయిత బుర్రా సాయి మాధవ్‌కు డాక్టరేట్

తాజాగా సినీరంగంలో రచయితగా తన ప్రస్థానాన్ని గుర్తించి కాలిఫోర్నియాకు చెందిన న్యూలైఫ్ థియొలాజికల్ యూనివర్సిటీ వారు నిన్న హైదరాబాద్ లోని రవీంద్రభారతిలో ఆయనకు గౌరవ డాక్టరేట్ ను

Sai Madhav

Burra Sai Madhav :  ఇటీవల కొన్ని యూనివర్సిటీలు వివిధ రంగాల్లో ప్రతిభ చూపించే వారికి, ఆయా రంగాల్లో సేవలు అందించేవారికి, పేరు ప్రఖ్యాతలు సంపాదించిన వారికి గౌరవ డాక్టరేట్ లు ప్రధానం చేస్తున్నాయి. అలాగే సినీ ప్రముఖులకు కూడా ఈ డాక్టరేట్ లను అందిస్తున్నాయి. తెలుగులో ఇప్పటికే చాలా మంది సినీ ప్రముఖులు వివిధ యూనివర్సిటీల నుంచి ఈ డాక్టరేట్ లని అందుకున్నారు. తాజాగా ప్రముఖ సినీ రచయిత బుర్రా సాయి మాధవ్ కి ఈ గౌరవం దక్కింది.

RNR Manohar : ప్రముఖ డైరెక్టర్, నటుడు మృతి.. విషాదంలో సినీ పరిశ్రమ

బుర్ర సాయి మాధవ్ ఎన్నో సంవత్సరాలుగా తెలుగు సినీ పరిశ్రమలో రచయితగా ఉన్నారు. పరిశ్రమలో సీరియల్స్ తో ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత సినిమాలకి మాటల రచయితగా మారి ఎన్నో సినిమాలకి డైలాగ్స్ అందించారు. ఇప్పుడు వచ్చే చాలా పెద్ద సినిమాలకు డైలాగ్స్ బుర్రా సాయి మాధవ్ రాస్తున్నారు. తెలుగు సినీ పరిశ్రమలో ప్రస్తుతం బిజీ రైటర్ గా ఉన్నారు సాయి మాధవ్.

Pushpaka Vimanam : బాలీవుడ్‌లోకి ‘పుష్పక విమానం’

తాజాగా సినీరంగంలో రచయితగా తన ప్రస్థానాన్ని గుర్తించి కాలిఫోర్నియాకు చెందిన న్యూలైఫ్ థియొలాజికల్ యూనివర్సిటీ వారు నిన్న హైదరాబాద్ లోని రవీంద్రభారతిలో ఆయనకు గౌరవ డాక్టరేట్ ను అందించారు. ఈ పురస్కారాన్ని సాయిమాధవ్ తన తల్లిదండ్రులకు అంకితమిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు సినీ,రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు.