C 202 Movie : హారర్ థ్రిల్లర్ ‘C 202’ సినిమా రిలీజ్ ఎప్పుడంటే..

‘సి 202’ సినిమా హారర్ థ్రిల్లర్ గా తెరకెక్కుతుంది.

Horror Thriller Movie C 202 Release Date Announced

C 202 Movie : తనికెళ్ళ భరణి, శుభలేఖ సుధాకర్, సత్య ప్రకాష్, షఫీ, చిత్రం శీను, వై విజయ.. పలువురు ముఖ్య పాత్రల్లో తెరకెక్కుతున్న సినిమా ‘సి 202’. మైటీ ఒక్ పిక్చర్స్ బ్యానర్ పై మనోహరి KA ఈ సినిమాని నిర్మిస్తుండగా మున్నా కాశి హీరోగా నటిస్తూ దర్శకత్వం, సంగీతం, ఎడిటింగ్ భాద్యతలను నిర్వహిస్తున్నారు. ఈ సినిమాలో గోవా బ్యూటీ షారోన్ రియా ఫెర్నాండెజ్ హీరోయిన్ గా నటించింది.

Also Read : Gorre Puranam : తెలుగు ఓటీటీ ఆహాలో మరో కొత్త సినిమా.. సుహాస్ ‘గొర్రె పురాణం’.. ఎప్పట్నించి అంటే..

ఈ ‘సి 202’ సినిమా హారర్ థ్రిల్లర్ గా తెరకెక్కుతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్, ట్రైలర్స్ రిలీజయ్యాయి. ఇటీవలే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ పూర్తవ్వడంతో ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసారు. ‘సి 202’ సినిమా అక్టోబర్ 25న రిలీజ్ కాబోతుంది. ట్రైలర్ లో ఒక్క డైలాగ్ కూడా లేకుండా సీన్స్, సౌండ్ ఎఫెక్ట్స్ తోనే భయపెట్టిన ఈ సినిమా మరి థియేటర్స్ లో ఏ రేంజ్ లో భయపెడుతుందో చూడాలి.