Game Changer : ఊహించ‌ని రేంజ్‌లో ‘గేమ్ ఛేంజ‌ర్’ టీజ‌ర్ ప్లాన్ చేసిన శంక‌ర్‌!

గ్లోబల్‌ స్టార్ రాంచరణ్‌ యాక్ట్ చేసిన యాక్షన్ థ్రిల్లర్‌ గేమ్‌ ఛేంజర్‌పై ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు ఉన్నాయ్‌.

Huge Expectations on Ram Charan Game Changer

Game Changer Teaser : గ్లోబల్‌ స్టార్ రాంచరణ్‌ యాక్ట్ చేసిన యాక్షన్ థ్రిల్లర్‌ గేమ్‌ ఛేంజర్‌పై ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు ఉన్నాయ్‌. దిల్‌రాజు ప్రొడ్యూస్ చేస్తున్న ఈ ప్రాజెక్ట్‌ సంక్రాంతికి రిలీజ్ కాబపోతోంది. గేమ్‌ ఛేంజర్ టీజర్‌ రిలీజ్‌కు కూడా ముహూర్తం ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. దీంతో మెగా ఫ్యాన్స్‌ ఆనందానికి హద్దుల్లేకుండా పోయాయ్‌. దీపావళి గిఫ్ట్‌గా టీజర్ రిలీజ్‌ చేసేందుకు మూవీ టీమ్‌ రెడీ అయింది. థౌజండ్‌వాలాను మించి టీజర్ రీసౌండ్ ఇవ్వడం ఖాయమని, మూవీ టీమ్ ధీమాగా చెప్తోంది.

టీజర్ కట్ ఇప్పటికే దాదాపు ఫినిష్ అయినట్లు తెలుస్తోంది. ఎవరు ఊహించని రేంజ్‌లో టీజర్‌ను ప్లాన్ చేశాడట డైరెక్టర్‌ శంకర్. చైన్నెలో టీజర్‌ కట్ జరిగింది. ఇందులోనే మరో కొత్త పాట బీట్‌ను కూడా యాడ్‌ చేసినట్లు టాక్‌. థమన్‌ మ్యూజిక్‌కు, చరణ్ స్టెప్పులు అదిరిపోయాయని ఇండస్ట్రీ టాక్‌. టీజర్‌లో పవర్‌ఫుల్ డైలాగ్స్‌ కూడా ఉండబోతున్నాయట. చరణ్ ఓల్డ్ గెటప్ రివీల్ అయ్యే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.

Rhea Chakraborty : సుశాంత్‌ సింగ్ రాజ్‌పుత్‌ కేసు.. సుప్రీం కోర్టులో బాలీవుడ్ న‌టి రియా చ‌క్ర‌వ‌ర్తికి ఊరట

ఇండస్ట్రీలో చాలామంది ప్రముఖులకు ఇప్పటికే గేమ్‌ఛేంజర్‌ టీజర్ చూపించారట. అది చూసి ప్రతీ ఒక్కరు అవాక్కయ్యారట. దీంతో మూవీ టీమ్‌లో మరింత కాన్ఫిడెన్స్ పెరిగింది. శంకర్‌ ఈజ్ బ్యాక్ అనేలా టీజర్‌ ఉంది అని తెలుస్తోంది. ఏమైనా రాంచరణ్ ఫ్యాన్స్‌కు ఈ దీపావళి మరింత జిల్‌జిగేల్‌మనడం ఖాయం అనిపిస్తోంది. ఈ మూవీలో రాంచరణ్‌కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ యాక్ట్ చేస్తోంది.

అంజలి మరో కీలకపాత్రలో కనిపించబోతోంది. టీజర్ రిలీజ్‌ డేట్‌పై వీకెండ్‌లోనే అధికారిక ప్రకటన రాబోతోందని టాక్‌. దీంతో మెగా ఫ్యాన్స్‌ కళ్లు కాయలు కాసేలా వెయిట్‌ చేస్తున్నారు. గేమ్ ఛేంజర్ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో భారీ బిజినెస్ జరగనున్నట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయ్. ఏపీ, తెలంగాణలో ఏకంగా 150 కోట్ల మేర థియేట్రికల్ బిజినెస్ జరిగే ఛాన్స్ ఉందని చెప్తున్నారు. గేమ్‌ఛేంజర్ రాకతో.. ఈ సంక్రాంతి మరింత కలర్‌ఫుల్‌గా మారడం ఖాయం.

35-Chinna Katha Kaadu : ’35 చిన్న కథ కాదు’ సినిమాకి అరుదైన గౌరవం..