తెలుగు సినిమాల్లో భారీ బడ్జెట్ తో.. భారీ సెట్స్!

  • Publish Date - April 2, 2019 / 06:51 AM IST

తెలుగు ఆడియన్స్ ని సెట్టింగులతోనే..మాయ చేస్తున్నారు టాలివుడ్ డైరెక్టర్స్. కాశ్మీర్ లోయల దెగ్గరి నుంచి కళ్లు చెదిరే కట్టడాల వరకు అన్నీ ఇక్కడే.. సైరా నుంచి సాహో వరకు ఇప్పుడు అబ్బురపర్చే సెట్స్ రెడీ అయిపోతున్నాయి. ఖర్చెక్కువైనా సరే కానీ.. సెట్ ప్రాపర్టీ అదిరిపోవాల్సిందే అంటోన్నారు టాలివుడ్ స్టార్ హీరోలు. రాజ భవనాల నుంచి పల్లెటూళ్ల దాకా..అద్భుతంగా నిర్మిస్తున్నారు ఆర్ట్ డైరెక్టర్లు. ప్రభాస్, రాధాకృష్ణ కాంబోలో తెరకెక్కుతోన్న జాన్ మూవీ షూటింగ్.. ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతోంది. ఈ సినిమా కోసం మూడు కోట్ల ఖర్చుతో హైద్రాబాద్ లోనే రోమ్ నగరాన్ని నిర్మిస్తున్నారు. అంతేకాదు.. ఫిలింసిటీలో రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కబోతున్న.. RRR మూవీ కోసం అల్యూమినియం ఫ్యాక్టరీలో భారీ సెట్స్ వేస్తున్నారు. సెకెండ్ షెడ్యూల్ లో భాగంగా..గండిపేట శివారులో..ఆర్ట్ డైరెక్టర్ సాబు సిరిల్ కోలకత్తా సిటీని సెట్ వేశారు.

ఇక మెగాస్టార్ సైరా కోసం..1840 నాటి పరిస్థితులను క్రియేట్ చేస్తున్నారు. సైరా సెట్టింగ్స్ కోసం..ఆర్ట్ డైరెక్ట‌ర్ రాజీవ‌న్ తో పాటుగా..15 మంది నిపుణుల బృందం పనిచేస్తోంది. రీసెంట్ గా బీదర్ కోటను..కోకాపేటలో సెట్ వేసింది మూవీ టీం. ప్రస్తుతం కోకాపేటలోనే సైరా షూటింగ్ జరుగుతుంది…ఆ తర్వాత మధ్యప్రదేశ్ లో వారం రోజులు, హైద్రాబాద్ శివారులోని దండుమైలవరం లో నాలుగు రోజులు షూటింగ్ జరగనుంది. మే ఫస్ట్ లోపు షూటింగ్ కంప్లిట్ చేసేందుకు సైరా టీం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. 

వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో..మహేశ్ బాబు హీరోగా రాబోతున్న మహర్షి సినిమా కోసం..ఫిలింసిటీలో ఓ విలేజ్ ని సెట్ వేశారు. మహర్షి సెకెండాఫ్ లో వచ్చే చాలా కీలకమైన సన్నివేశాల్ని..ఈ విలేజ్ సెట్ లోనే షూట్ చేశారు. ప్రస్తుతం మహర్షి షూటింగ్ హైద్రాబాద్ లోనే జరుగుతోంది.