ప్రముఖ తమిళ సినీ దర్శకుడు, నటుడు భారతి రాజా ఇంట్లో చోరీ జరిగింది.. మాంబళం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు..
ప్రముఖ తమిళ సినీ దర్శకుడు, నటుడు భారతి రాజా ఇంట్లో చోరీ జరిగింది. చోరీకి పాల్పడిన వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. టి.నగర్‌లోని కృష్ణ వీధిలో భారతిరాజా నివసిస్తున్నారు.
రెండు రోజుల క్రితం రెండో అంతస్తులో నిద్ర పోయిన ఆయన మరుసటిరోజు ఉదయం కిందకు వచ్చి చూడగా.. రూ.లక్ష విలువైన ఐ ఫోన్, పూజ గదిలో ఉంచిన రూ. లక్ష విలువగల 1 కేజీ వెండి వస్తువులతో పాటు రూ.15 వేల నగదు అదృశ్యం కనిపించకపోవడంతో ఆయన మాంబళం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
Read Also : అరవింద్ స్వామి ‘భాస్కర్ ఒరు రాస్కల్’ తెలుగులో..
ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు ఆ ప్రాంతంలో ఏర్పాటు చేసిన సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా ఆగం తకుల కోసం గాలిస్తున్నారు. అలాగే, ఆయన ఇంట్లో పనిచేస్తున్న వారిని కూడా పోలీసులు విచారిస్తున్నారు. భారతీ రాజా ఇటీవల శివ కార్తికేయన్ నటించిన ‘నమ్మవీట్టు పిళ్లై’ చిత్రంలో నటించారు.