50 రోజుల హుషారు
డిసెంబర్ 14న లిమిటెడ్ థియేటర్స్‌లో రిలీజ్ అయిన హుషారు.. ఫిబ్రవరి 1తో, విజయవంతంగా 50 రోజులు పూర్తి చేసుకుంది.

డిసెంబర్ 14న లిమిటెడ్ థియేటర్స్‌లో రిలీజ్ అయిన హుషారు.. ఫిబ్రవరి 1తో, విజయవంతంగా 50 రోజులు పూర్తి చేసుకుంది.
తేజస్ కంచెర్ల, అభినవ్, తేజ్ కూరపాటి, దినేష్ తేజ్, రాహుల్ రామకృష్ణ, ప్రియా వడ్లమాని, దక్ష, రమ్య పసుపులేటి మెయిన్ లీడ్స్‌గా, శ్రీహర్ష డైరెక్షన్‌లో, బెక్కం వేణు గోపాల్, రియాజ్ ప్రొడ్యూస్ చేసిన యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్.. హుషారు.. డిసెంబర్ 14న లిమిటెడ్ థియేటర్స్‌లో రిలీజ్ అయిన హుషారు.. ఫిబ్రవరి 1తో, విజయవంతంగా 50 రోజులు పూర్తి చేసుకుంది. యువత లైఫ్ స్టైల్‌ని బేస్ చేసుకుని రూపొందిన సినిమా కావడం, రాహుల్ రామకృష్ణ కామెడీ ఆకట్టుకోవడంతో, హుషారుకి యూత్ బాగా కనెక్ట్ అవడమే కాక, రీపీటెడ్‌గా సినిమా చూసారు.
ఫస్ట్‌డే నుండి మౌత్‌టాక్‌తో, రోజు రోజుకీ థియేటర్స్ పెంచుకుంటూ, యూత్‌ని ఆకట్టుకుంటూ, హౌస్‌ఫుల్ కలెక్షన్స్‌తో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతున్న హుషారు.. చిన్న సినిమాగా రిలీజ్ అయినా, పెద్ద విజయం సాధించి, కంటెంట్ ఉంటే ఆడియన్స్ ఆదరిస్తారని మరోసారి ప్రూవ్ చేసింది. ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని శ్రీ మయూరి థియేటర్ లో, 50 రోజులకు గానూ.. దాదాపు, రూ. 40 లక్షలకు పైగా గ్రాస్ వసూలు చేసింది. 2018 సంవత్సరం చివరిలో రిలీజ్ అయ్యి, బాక్సాఫీస్ వద్ద సత్తా చాటిన సినిమా హుషారు కావడం విశేషం.
వాచ్ ఉండి పోరాదే సాంగ్…