×
Ad

Hyper Aadi : పవన్ కి సపోర్ట్ చేస్తాను కాబట్టే నా మీద నెగిటివిటీ.. నన్ను టార్గెట్ చేసి మరీ.. వాటికి కౌంటర్ ఇచ్చిన ఆది..

ఆది ఓ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వగా ఇలాంటి కామెంట్స్ పై స్పందించాడు.(Hyper Aadi)

Hyper Aadi

Hyper Aadi : జబర్దస్త్ తో ఫేమ్ తెచ్చుకొని స్టార్ కమెడియన్ అయ్యాడు హైపర్ ఆది. రైటర్ గా, కమెడియన్ గా సినిమాలు, టీవీ షోలతో బిజీగానే ఉన్నాడు ఆది. అయితే ఆది డబల్ మీనింగ్ డైలాగ్స్ వేస్తాడు, బాడీ షేమింగ్ డైలాగ్స్ వేస్తాడు అని పలువురు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తూ ఉంటారు. తాజాగా ఆది ఓ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వగా ఇలాంటి కామెంట్స్ పై స్పందించాడు.(Hyper Aadi)

Also See : Gayathri Simhadri : కార్తీక దీపం విలన్ ని గుర్తుపట్టారా..? సీరియల్ లో అలా.. బయట ఇలా.. ఫొటోలు వైరల్..

హైపర్ ఆది మాట్లాడుతూ.. నాకు సామాన్య ప్రేక్షకుడి నుంచి ఎలాంటి వ్యతిరేకత ఉండదు. నేను పవన్ కళ్యాణ్ గారికి, జనసేన కు సపోర్ట్ చేస్తా కాబట్టి సోషల్ మీడియాలో ఓ పది శాతం మంది తిడతారు, నా గురించి తప్పుగా మాట్లాడతారు. పవన్ కళ్యాణ్ గారి కోసం నేను ఎంత నెగిటివిటీ అయినా భరిస్తాను. నేను పవన్ కళ్యాణ్ గారిని ప్రేమిస్తాను. పాలిటిక్స్ లో ఉన్నప్పుడు ఇలాగే ఉంటాయి.

కాలేజీలో కూడా ఒకసారి ఆయనకు సపోర్ట్ గా మాట్లాడాను అని ఓ పది మంది సీనియర్లు నన్ను బెదిరించారు. ఇంకోసారి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడితే బిల్డింగ్ పైనుంచి తోసేస్తాం అని వార్నింగ్ ఇచ్చారు. ఇప్పుడు ఆ పదిమంది ఇంకా సప్లీలు రాసుకుంటూ అక్కడే తిరుగుతున్నారు. నేను పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వచ్చేసా.

Hyper Aadi

నా మీద ఫేక్ పోస్ట్ లు కూడా పెట్టారు. కానీ నేను ఎవ్వరికి భయపడే వ్యక్తిని కాదు. కొంతమంది నేను ఏం చేసినా నెగిటివ్ చేస్తారు. డబల్ మీనింగ్ జోక్స్ వేయని టీమ్ లీడర్ ఎవరైనా ఉన్నారా? నేను రాకముందు నుంచే ఉంది. నేను వచ్చాక నా వల్ల టీవీ షోలకు రేటింగ్స్ వస్తున్నాయి కాబట్టి నేను ఇంకా ఉన్నాను. నా వ్యూయర్ షిప్ చెప్తుంది నేనేంటో.

Also Read : Hyper Aadi : అందర్నీ నవ్వించే హైపర్ ఆదిలో ఇంత బాధ ఉందా.. ఇతని బ్రేకప్ స్టోరీ తెలుసా? ఆ అమ్మాయి ఎక్కడ ఉందో..

బాడీ షేమింగ్ చాలా సినిమాల్లో కూడా ఉంది. కోట గారు చాలా సినిమాల్లో బాబు మోహన్ ని బాడీ షేమింగ్ తిట్లు తిట్టారు. అది అక్కడ ఇద్దరి ఆర్టిస్టుల మధ్య అండర్ స్టాండింగ్ బట్టి ఉండేది. నేను చేసే టీమ్ లో అందరితో నాకు మంచి అండర్ స్టాండింగ్ ఉంది. నేను ఏం డైలాగ్ వేస్తానో వాళ్లకు చెప్పే, వాళ్ళు ఒప్పుకున్నాకే వేస్తాను. ఒక స్కిట్ లో అన్ని ఉంటాయి. చూసేవాళ్ళు అలాగే ఉన్నారు. శిరిడి సాయి బాబా లాంటి సినిమాలు తీస్తే వంద కోట్లు రావు, బేబీ లాంటి సినిమాకు వస్తాయ్ ఎందుకు మరి. నన్ను కామెంట్ చేసేవాళ్ళే ముందు డబల్ మీనింగ్ సినిమాలకు వెళ్తారు.

నన్ను టార్గెట్ చేయాలి అని ఫిక్స్ అయ్యారు కాబట్టి చేస్తున్నారు. నన్ను టార్గెట్ చేసే వాళ్ళు కూడా వ్యూస్, రీచ్ కోసమే. నా గురించి ఎంత నెగిటివ్ గా మాట్లాడినా నాకు నచ్చిన నాయకుడికి నేను లైఫ్ లాంగ్ ఆయనకు సపోర్ట్ చేస్తూనే ఉంటా. నేను నమ్మిన నాయకుడు గొప్ప నాయకుడు. నన్ను టార్గెట్ చేసే వాళ్ళు రండి వచ్చి కామెడీ రాయండి. నేనే అవకాశం ఇస్తాను. కామెడీ చాలా చాలా కష్టం. వచ్చి రాసి నవ్వించండి అని ఛాలెంజ్ కూడా విసిరారు. మరి హైపర్ ఆది మీద నెగిటివిటీ చేసే వాళ్ళు దీన్ని ఎలా తీసుకుంటారో.

Also Read : Hyper Aadi : అప్పట్లోనే 20 లక్షలు అప్పు.. మా నాన్నేమో బాగా తాగేవాడు.. హైపర్ ఆది ఎమోషనల్..