Hyper Aadi : అందర్నీ నవ్వించే హైపర్ ఆదిలో ఇంత బాధ ఉందా.. ఇతని బ్రేకప్ స్టోరీ తెలుసా? ఆ అమ్మాయి ఎక్కడ ఉందో..

హైపర్ ఆది తన లవ్ ఫెయిల్యూర్ స్టోరీ గురించి కూడా చెప్పుకొచ్చాడు. (Hyper Aadi)

Hyper Aadi : అందర్నీ నవ్వించే హైపర్ ఆదిలో ఇంత బాధ ఉందా.. ఇతని బ్రేకప్ స్టోరీ తెలుసా? ఆ అమ్మాయి ఎక్కడ ఉందో..

Hyper Aadi

Updated On : January 4, 2026 / 5:28 PM IST

Hyper Aadi : జబర్దస్త్ లో కమెడియన్ గా ఎంట్రీ ఇచ్చిన హైపర్ ఆది తక్కువ సమయంలోనే తన కామెడీ టైమింగ్, రైటింగ్ తో సక్సెస్ అయ్యాడు. ప్రస్తుతం రచయితగా, కమెడియన్ గా పలు టీవీ షోలు, సినిమాలతో బిజీగా ఉన్నాడు. తాజాగా ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో హైపర్ ఆది అనేక ఆసక్తికర విషయాలు తెలిపాడు.

ఈ క్రమంలో హైపర్ ఆది తన లవ్ ఫెయిల్యూర్ స్టోరీ గురించి కూడా చెప్పుకొచ్చాడు.

Also Read : Hyper Aadi : అప్పట్లోనే 20 లక్షలు అప్పు.. మా నాన్నేమో బాగా తాగేవాడు.. హైపర్ ఆది ఎమోషనల్..

హైపర్ ఆది మాట్లాడుతూ.. నాకు కూడా లవ్ స్టోరీ ఉంది. నేను బిటెక్ లో ఉన్నప్పుడు ఒక అమ్మాయిని లవ్ చేశాను. ఆడపిల్లలకు తొందరగా పెళ్ళి చేస్తారు కదా. నాకు బిటెక్ అవ్వగానే జాబ్ రాలేదు. నాకు జాబ్ లేదని ఆ అమ్మాయి ఇంట్లో ఏం చెప్పలేదు. బిటెక్ అవ్వగానే వాళ్ళ ఇంట్లో ఆమెకు పెళ్లి చేసేసారు. ఆ అమ్మాయి వెళ్ళిపోయింది. నేను చాలా బాధపడ్డాను. ఒక రూమ్ లో కూర్చొని ఏడ్చాను. మంచి అమ్మాయి మిస్ అయిపోయింది అని బాధపడ్డాను.

పెళ్లి అయ్యాక ఆ అమ్మాయి నుంచి మనకు మెసేజ్, కాల్ రాదు. ఆ అమ్మాయి ఎక్కడ ఉందో మనకు తెలీదు. కానీ ఆ అమ్మాయి కి నేను ఒకడ్ని ఉన్నాను అని తెలియాలంటే సక్సెస్ అవ్వాలి. వీడు ఒకడు ఉన్నాడు అని తెలియాలి. నాకు జాబ్ లేదు అనే వేరే వాడ్ని పెళ్లి చేసుకుంది. అందుకే నేను సక్సెస్ అవ్వాలి అని ఫిక్స్ అయ్యా. ఇవాళ ఆ అమ్మాయి ఎక్కడ ఉందో నాకు తెలీదు కానీ హైపర్ ఆది అంటే ఏంటో అందరితో పాటే ఆ అమ్మాయికి తెలుసు. ఇదే సక్సెస్ అని తెలిపాడు.

Also Read : Mana ShankaraVaraPrasad Garu : ‘మన శంకర వరప్రసాద్ గారు’ ట్రైలర్ వచ్చేసింది.. బాస్ అదరగొట్టాడుగా.. ఫ్యామిలీలకు పండగే..