Mana ShankaraVaraPrasad Garu : ‘మన శంకర వరప్రసాద్ గారు’ ట్రైలర్ వచ్చేసింది.. బాస్ అదరగొట్టాడుగా.. ఫ్యామిలీలకు పండగే..
మన శంకర వరప్రసాద్ గారు ట్రైలర్ మీరు కూడా చూసేయండి..
Mana ShankaraVaraPrasad Garu
Mana ShankaraVaraPrasad Garu : మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా మన శంకర వరప్రసాద్ గారు. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ పై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. నయనతార, క్యాథరిన్ త్రెసా ఈ సినిమాలో హీరోయిన్స్ గా నటిస్తుండగా వెంకటేష్ గెస్ట్ రోల్ చేస్తున్నారు.
ఇప్పటికే ఈ సినిమా నుంచి సాంగ్స్, టీజర్, గ్లింప్స్ రిలీజయి అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12 రిలీజ్ కానుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేసారు.
Also Read : Riddhi Kumaar : చీర గిఫ్ట్ గా ఇచ్చాడని.. ప్రభాస్ కడుపు నింపిన హీరోయిన్.. ఏం పెట్టిందో తెలుసా?
మన శంకర వరప్రసాద్ గారు ట్రైలర్ మీరు కూడా చూసేయండి..
ట్రైలర్ చూస్తుంటే చిరంజీవి వింటేజ్ కామెడీ బాగానే ఉన్నట్టు, భార్య భర్తల కామెడీ సీన్స్, మాస్ యాక్షన్ ఫైట్స్, చిరు – వెంకీ కాంబో అదిరిపోతున్నట్టు తెలుస్తుంది. ట్రైలర్ లోనే డైలాగ్స్ అదరగొట్టారు. ట్రైలర్ తో సినిమాపై మరిన్ని అంచనాలు నెలకొన్నాయి. పండక్కి మరోసారి అనిల్ రావిపూడి ఫ్యామిలీలకు దగ్గరయి హిట్ కొట్టడం గ్యారెంటీ.
Also See : Anasuya Bharadwaj : కొప్పున పూలెట్టి, పట్టు చీర కట్టి.. అనసూయ లేటెస్ట్ ఫొటోలు చూశారా..?
