అందరకీ ప్రభాస్ భారీ డిన్నర్లు ఇస్తే.. రాజాసాబ్ కే భారీ డిన్నర్ ఇచ్చిన హీరోయిన్..

మొదటిసారి ఓ హీరోయిన్ ప్రభాస్ కి నేను వండి పెట్టాను అని చెప్పింది. (Riddhi Kumaar)

అందరకీ ప్రభాస్ భారీ డిన్నర్లు ఇస్తే.. రాజాసాబ్ కే భారీ డిన్నర్ ఇచ్చిన హీరోయిన్..

Riddhi Kumaar

Updated On : January 5, 2026 / 11:01 AM IST

Riddhi Kumaar : ప్రభాస్ గురించి అందరికి తెలిసిందే. ఎవరికైనా కడుపు నిండా ఫుడ్ పెడతాడు. ఫుడ్ పెట్టి చంపేస్తాడు అని సరదాగా కూడా చెప్తూ ఉంటారు సెలబ్రిటీలు. ఇక ప్రభాస్ తో నటించే వాళ్లకు కచ్చితంగా షూటింగ్ టైంలో ప్రభాస్ ఇంటి నుంచి రకరకాల ఐటమ్స్ తీసుకొచ్చి తినిపిస్తాడు. ఇప్పటివరకు ప్రభాస్ అందరికి ఫుడ్ పెట్టాడు అని చెప్పిన వాళ్ళే కానీ ప్రభాస్ కి నేను ఫుడ్ పెట్టాను అని ఎవరూ చెప్పలేదు.(Riddhi Kumaar)

మొదటిసారి ఓ హీరోయిన్ ప్రభాస్ కి నేను వండి పెట్టాను అని చెప్పింది. రాజాసాబ్ సినిమాలో నటించిన రిద్ధి కుమార్ ప్రమోషన్స్ లో భాగంగా వరుస ఇంటర్వ్యూలు ఇస్తుంది. ఇటీవల రాజాసాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో రిద్ధి కుమార్ మాట్లాడుతూ.. ప్రభాస్ నాకు మూడేళ్ళ క్రితం చీర గిఫ్ట్ ఇచ్చాడు. ఆ చీరని ఇవాళ కట్టుకొచ్చాను అని తెలిపింది. దీంతో ప్రభాస్ చీర గిఫ్ట్ ఇచ్చాడా హీరోయిన్ కి అని అంతా షాక్ అయ్యారు.

Also Read : Anasuya Bharadwaj : కొప్పున పూలెట్టి, పట్టు చీర కట్టి.. అనసూయ లేటెస్ట్ ఫొటోలు చూశారా..?

తాజాగా ఓ ఇంటర్వ్యూలో రిద్ధి కుమార్ ఆసక్తికర విషయం తెలిపింది. రిద్ధి కుమార్ మాట్లాడుతూ.. ప్రభాస్ అందరికి ఫుడ్ తెప్పిస్తాడు ఇంటి నుంచి. చాలా సార్లు ఫుడ్ పెట్టాడు. అందుకే నాకు కూడా ప్రభాస్ కి ఫుడ్ ఇవ్వాలనిపించింది. ఫుడ్ మన కల్చర్ లో ఉంది. అందుకే ఒక రోజు నేను ఇంటి దగ్గర నుంచి బటర్ చికెన్ వండి తీసుకెళ్లి ప్రభాస్ కి పెట్టాను. చాలా బాగుంది అన్నాడు. నేను బటర్ చికెన్ బాగా వండుతాను. ఎప్పుడూ ప్రభాస్ ఇంటి నుంచి ఫుడ్ తెప్పిస్తాడు కదా నాకు ప్రభాస్ కి ఇంటి నుంచి వండి తీసుకురావాలి అనిపించింది అని చెప్పింది.

దీంతో రిద్ధి కుమార్ కామెంట్స్ వైరల్ గా మారాయి. అసలు ఇంట్రావర్ట్ లా ఉండే ప్రభాస్, అమ్మాయిలతో ఎక్కువగా మాట్లాడని హీరో చీర గిఫ్ట్ ఇచ్చాడు అని చెప్తుంది, ప్రభాస్ కోసం ఫుడ్ వండి పెట్టి తీసుకొచ్చాను అని చెప్తుంది, ఏంటి సంగతి వీళ్లిద్దరి మధ్య ఇంత మంచి బాండింగ్ ఎలా అని ఫ్యాన్స్, నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటివరకు ప్రభాస్ తో పని చేసిన ఏ హీరోయిన్ అయినా ప్రభాస్ ఫుడ్ తెప్పించి పెట్టాడు అని చెప్పారు కానీ రిద్ధి కుమార్ మాత్రం ఇలా ఆసక్తికర విషయాలు చెప్తుండటంతో వైరల్ గా మారింది.

Also Read : Rahul Sipligunj : భార్యతో హనీమూన్ ఎంజాయ్ చేస్తున్న రాహుల్ సిప్లిగంజ్.. దుబాయ్ లో రచ్చ.. ఫొటోలు వైరల్..

ఇక రాజాసాబ్ సినిమా జనవరి 9న రిలీజ్ కానుంది. ఈ సినిమాలో రిద్ధి కుమార్ – ప్రభాస్ జంట ఎలా మెప్పిస్తుందో చూడాలి.