Hyper Aadi : అప్పట్లోనే 20 లక్షలు అప్పు.. మా నాన్నేమో బాగా తాగేవాడు.. హైపర్ ఆది ఎమోషనల్..
ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో హైపర్ ఆది తన ఫ్యామిలీ గురించి చెప్తూ ఎమోషనల్ అయ్యాడు.(Hyper Aadi)
Hyper Aadi
- జబర్దస్త్ హైపర్ ఆది ఇంటర్వ్యూ
- తన కష్టాలు చెప్పిన హైపర్ ఆది
- తన తండ్రి గురించి చెప్పిన ఆది
Hyper Aadi : జబర్దస్త్ లో కమెడియన్ గా ఎంట్రీ ఇచ్చిన హైపర్ ఆది ఆ తర్వాత టీమ్ లీడర్ గా ఎదిగి రైటర్ గా, కమెడియన్ గా సినీ, టీవీ పరిశ్రమలో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి బాగా సక్సెస్ అయ్యాడు హైపర్ ఆది. తాజాగా ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో హైపర్ ఆది తన ఫ్యామిలీ గురించి చెప్తూ ఎమోషనల్ అయ్యాడు.(Hyper Aadi)
Hyper Aadi
హైపర్ ఆది తన డిగ్రీ అయ్యే సమయానికి వాళ్లకు ఉన్న అప్పు గురించి మాట్లాడుతూ.. మేము ముగ్గురు అబ్బాయిలు. మమ్మల్ని చదివించడానికి, మమ్మల్ని బయటకు పంపడానికి చాలా ఖర్చు అయింది. అప్పుడే పంట కూడా సరిగ్గా చేతికి రాక ఆల్మోస్ట్ 20 లక్షలు అప్పు అయింది. నేనే మొదట జాబ్ చేశా, నాకు 15 వేలు జీతం. కానీ అప్పుడు నెలకు 40 వేలు కట్టాల్సి వచ్చేది వడ్డీ. ఒక అన్నయ్యకి జాబ్ రాలేదు. ఇంకో అన్నయ్యకు జాబ్ మీద ఇంట్రెస్ట్ లేదు.
ఇక్కడ హైదరాబాద్ లో తినడానికి, ఉండటానికి డబ్బులు కావాలి. హాస్టల్ ఖర్చు మిగుల్చుకోడానికి చుట్టాలకు లేడీస్ హాస్టల్ ఉండేది, అక్కడ ఉండేవాడిని. ఖాళీగా ఉన్న సమయాల్లో రెండు వీడియోలు తీస్తే దానికి అభి అన్న కామెంట్ పెట్టి కలిసాడు. అలా నేను జబర్దస్త్ కి వెళ్ళాను. జబర్దస్త్ కి వెళ్ళాక ఇంట్లో మొదట తిట్టారు. ఊళ్ళో వాళ్ళు అందరూ కామెంట్స్ చేస్తున్నారు అని చెప్పేవాళ్ళు అమ్మానాన్న. జాబ్ చేయకుండా ఇవన్నీ ఎందుకు అన్నారు. నా అప్పులు తీర్చడానికి మా మూడెకరాల పొలం అమ్మేసాం. అందరూ వద్దు అన్నా కూడా మైండ్ ఫ్రీ అయిపోద్ది అని అమ్మించేసా. తర్వాత జబర్దస్త్ తో సక్సెస్ అయి మళ్ళీ మూడెకరాల పొలం కొనుక్కున్నా అని తెలిపాడు.
Also Read : Riddhi Kumaar : చీర గిఫ్ట్ గా ఇచ్చాడని.. ప్రభాస్ కడుపు నింపిన హీరోయిన్.. ఏం పెట్టిందో తెలుసా?
అలాగే తన తండ్రి గురించి చెప్తూ.. మా నాన్న తాగేవాడు. ఆయన తాగడం మానలేకపోయాడు. అందుకే ఆయనకు కిడ్నీ ప్రాబ్లమ్ వచ్చింది. కానీ తర్వాత ట్రీట్మెంట్ చేయించా. నాన్నని అలా చూడటం వల్ల నాకు మందు అలవాటు కాలేదు. కానీ తాగే వాళ్ళ మధ్య కూర్చుంటాను. నాకు స్కిట్స్ కంటెంట్ అదే. అందుకే తాగేవాళ్ళ మధ్య కూర్చొని వల్ల మాటలు వింటాను.
నేను సక్సెస్ అయ్యాక కూడా ఊళ్ళో రోజూ పొద్దున్నే బాగా రెడీ అయి బొట్టు పెట్టుకొని మరీ వైన్ షాప్ కి వెళ్తాడు. ఎందుకు అలా అన్నయ్య కావాలంటే తెచ్చిస్తాడు కదా అంటే నేను అక్కడికి వెళ్తే లైన్ లో ఎంతమంది ఉన్నా హైపర్ ఆది వాళ్ళ నాన్న వచ్చాడని నన్ను ముందు పంపిస్తారు అంటదు. అన్ని వేళ్ళకు ఉంగరాలు, మెడలో చైన్ వేసుకొని అందరికి చూపిస్తూ తిరుగుతాడు అని చెప్పుకొచ్చాడు.
Also See : Anasuya Bharadwaj : కొప్పున పూలెట్టి, పట్టు చీర కట్టి.. అనసూయ లేటెస్ట్ ఫొటోలు చూశారా..?
