Anasuya : ‘నాకు కుటుంబం ఉంది.. ప్లీజ్..’ అంటూ అన‌సూయ వ‌రుస ట్వీట్లు.. ఏమైంద‌బ్బా..?

అన‌సూయ భ‌ర‌ద్వాజ్.. తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం చేయాల్సిన ప‌ని లేదు. బులితెర‌పై స్టార్ యాంక‌ర్‌గా పేరు తెచ్చుకుంది. ఇక సినిమాల్లోనూ న‌టిస్తూ త‌నదైన ముద్ర‌ను వేస్తోంది.

Anasuya : ‘నాకు కుటుంబం ఉంది.. ప్లీజ్..’ అంటూ అన‌సూయ వ‌రుస ట్వీట్లు.. ఏమైంద‌బ్బా..?

Anasuya Bharadwaj

Updated On : June 19, 2023 / 5:36 PM IST

Anasuya Bharadwaj : అన‌సూయ భ‌ర‌ద్వాజ్.. తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం చేయాల్సిన ప‌ని లేదు. బులితెర‌పై స్టార్ యాంక‌ర్‌గా పేరు తెచ్చుకుంది. ఇక సినిమాల్లోనూ న‌టిస్తూ త‌నదైన ముద్ర‌ను వేస్తోంది. సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ త‌న‌కు సంబంధించిన విష‌యాల‌ను షేర్ చేసుకుంటుంది. గ‌త కొంత‌కాలంగా ఏదో ఒక వివాదంతో అన‌సూయ వార్త‌ల్లో నిలుస్తున్న సంగ‌తి తెలిసిందే. కొద్ది రోజుల క్రితం ఓ యువ హీరోపై ట్వీట్ చేయ‌గా అత‌డి అభిమానులు ఆమెను ట్రోల్ చేశారు.

ఎలాగోలా ఆ వివాదం స‌ద్దుమ‌ణిగింది అనుకుంటున్న టైమ్‌లో ఇటీవ‌ల సోష‌ల్ మీడియాలో బికినీ ఫోటోల‌ను షేర్ చేసి ర‌చ్చ చేసింది. దీంతో కొంద‌రు ఆమె డ్రెస్సింగ్ ను త‌ప్పుబ‌ట్ట‌గా మ‌రికొంద‌రు ఆమెకు మ‌ద్ద‌తుగా నిలిచారు. ఇక తాజాగా అన‌సూయ మ‌రోసారి వ‌రుస ట్వీట్లు చేసింది. తాను స్వ‌శ‌క్తితో ఎదిగాన‌ని, ప్ర‌శంసించ‌లేక‌పోతే, ప్రోత్స‌హించ‌లేక‌పోతే త‌న‌కు దూరంగా ఉండాలంటూనే ఇత‌రుల గౌర‌వాన్ని దెబ్బ‌తీసేందుకు త‌న పేరును ఉప‌యోగించుకోవ‌డం స‌రికాదంటూ చెప్పుకొచ్చింది.

Anasuya : బికినిలో బీచ్ వద్ద ఫుల్ ఎంజాయ్ చేస్తున్న అనసూయ..

‘అందరికి నమస్కారం.. సినీ, రాజ‌కీయ రంగాల‌కు చెందిన ప‌లువురిని అగౌర‌ప‌ర‌చ‌డం కోసం నా పేరును కొంత మంది ఉప‌యోగిస్తున్నారు. ఇందుకు సంబంధించిన ట్వీట్ల‌ను కొన్ని రోజులుగా చూస్తున్నాను. నా పేరును వాడ‌డం అంటే న‌న్ను కూడా అవమానించిన‌ట్లే. వీటికి నాకు ఏ సంబంధం లేదు. నా జీవితాన్ని నాకు ఇష్టం వ‌చ్చిన‌ట్లుగా జీవించాల‌ని కోరుకుంటున్నాను. నేను ఎవ్వ‌రి జోలికి వెళ్ల‌డం లేదు. ఎందుకంటే అది అన‌వ‌స‌ర‌మైన బాధ‌ను క‌లిగిస్తుంద‌ని నేర్చుకున్నాను.’ అని అన‌సూయ చెప్పింది.

Honey Rose : అక్క‌డ ముద్దు పెట్టేందుకు చాలా పెద్ద రిస్క్ చేసిన హానీ రోజ్‌

తాను స్వ‌శ‌క్తితో ఎదిగిన మ‌హిళ‌ల‌ని తెలిపింది. త‌న గురించి గొప్ప‌గా చెప్పేందుకు త‌న‌కు పీఆర్ గానీ ఇత‌ర సంస్థ‌లు ఏమీ లేవంది. త‌న‌ను ప్రోత్స‌హించ‌క‌పోయినా, ప్ర‌శంసించ‌లేక‌పోయినా ఫ‌ర్వాలేదు గానీ, క‌నీసం త‌న‌కు జోలికి మాత్రం రావొద్ద‌ని విజ్ఞ‌ప్తి చేసింది. స‌రైన మార్గంలో త‌న‌ను తాను నిరూపించుకునేందుకు ముందుకు సాగుతున్న‌ట్లు చెప్పింది. ‘నాకు ఓ కుటుంబం ఉంది. ప్లీజ్’ అంటూ అన‌సూయ వ‌రుస ట్వీట్లు చేసింది.

Kalyaan Dhev : శ్రీజ‌తో విడాకులు.. వారంలో నాలుగు గంట‌లు.. ఇన్‌స్టా పోస్ట్‌తో క‌ల్యాణ్‌దేవ్ క్లారిటీ..!

వీటిని చూసిన నెటీజ‌న్లు, ఆమె అభిమానులు ఏం జ‌రిగింది అంటూ కామెంట్లు పెడుతున్నారు. అన‌సూయ ఇలా ట్వీట్లు పెట్ట‌డానికి గ‌ల కార‌ణం ఆమె చెప్పేవ‌ర‌కు ఎవ్వ‌రికి తెలియ‌దు.