Bigg Boss OTT Telugu: నాకు ఇద్దరు.. నాకు ముగ్గురు.. హౌస్‌లో డేటింగ్ హిస్టరీ!
నాన్ స్టాప్ బిగ్ బాస్ మొదలై ఐదు రోజులు గడుస్తుంది. ఫిబ్రవరి 26న మొదలైన ఈ షోలో ఇంట్లోకి 17 మంది కంటెస్టెంట్లను పంపిన బిగ్ బాస్ అందులో 9 మంది లేడీ కంటస్టెంట్లు ఉండగా.. అందులో..
- Naresh Mannam
- Published On : March 2, 2022 / 08:26 PM IST
Bigg Boss Ott Telugu
Bigg Boss OTT Telugu: నాన్ స్టాప్ బిగ్ బాస్ మొదలై ఐదు రోజులు గడుస్తుంది. ఫిబ్రవరి 26న మొదలైన ఈ షోలో ఇంట్లోకి 17 మంది కంటెస్టెంట్లను పంపిన బిగ్ బాస్ అందులో 9 మంది లేడీ కంటస్టెంట్లు ఉండగా.. అందులో ఒకరిద్దరు మినహా అంతా బోల్డ్ బ్యూటీస్ గా పేరున్న వాళ్ళే కావడం విశేషం. బిగ్ బాస్ అనుకున్నట్లే తొలి వారం మసాలా మొదలు పెట్టినట్లుగా కనిపిస్తుంది. బిగ్ బాస్ అంటేనే గొడవలు, అరుపులు, కోపాలు, పంతాలు, రొమాన్స్, లవ్, ఓదార్పు ఇలా ఎన్నో యాంగిల్స్ చూపిస్తాడు.
Bigg Boss OTT Telugu: హౌస్ నిండా బోల్డ్ బ్యూటీస్.. బిగ్‌బాస్ ఏం స్కెచ్ వేశాడో?
గడిచిన ఐదు రోజుల్లోనే అవన్నీ చూపించేశాడు బిగ్ బాస్. ఎక్కువగా భాగం పాత వాళ్ళే కావడంతో ఇవన్నీ వంటబట్టి తొలి వారం నుండే గేమ్స్ మొదలు పెట్టారు. స్ప్రింగ్ వీల్ కార్డ్స్ తో గేమ్ ఇచ్చిన బిగ్ బాస్ వీల్ ఎవరి వైపు చూపిస్తే వాళ్ళు కార్డు లో ఉన్న ప్రశ్నకి ఫిల్టర్ లేకుండా సమాధానం చెప్పాలని టాస్క్ ఇచ్చాడు. అయితే.. ఆ కార్డ్స్ లో అన్నీ లవ్ అఫైర్స్, డేటింగ్ లాంటివే ఉండగా కంటెస్టెంట్స్ కూడా ఓపెన్ గా అన్నీ చెప్పేశారు. ఒకవిధంగా నాకు ఇద్దరున్నారని ఒకరంటే నేను ముగ్గురితో డేట్ చేసానని మరొకరు హిస్టరీ విప్పేశారు.
Bigg Boss OTT Telugu: పాత వాళ్ళు వారియర్స్.. కొత్త వాళ్ళు చాలెంజర్స్!
ఇప్పటి వరకు నాకు రెండు రిలేషన్ షిప్స్ ఉన్నాయని.. టాక్సిసిటీ వలనే బ్రేకప్స్ అవుతున్నాయని తేజస్వి చెప్తే.. ముద్దు పెడుతుంటే చి ఇంక ఆపేయ్ అంటూ ఎవరితో అన్నవని అరియనాకి వచ్చిన ప్రశ్నకి ఒకరి గురించి చెప్తే మరొకరు బాధపడతారని తనకి ఇద్దరు ఉన్నారని చెప్పకనే చెప్పింది. నేను మంచి కిస్సర్ అని నా ఎక్స్ నాకు చెప్పిందని అఖిల్ చెప్తే.. ఇద్దరు వ్యక్తులను ఒకేసారి డేట్ చేసావా అని అషురెడ్డి ప్రశ్నకు.. చాలాసార్లు ఇదే చేశా.. లెక్కలు గుర్తు లేవని చెప్పింది.
Bigg Boss OTT Telugu: 8 మంది కొత్త కంటెస్టెంట్ల బ్యాక్ గ్రౌండ్ ఇదే!
ఇక నటరాజ్ మాస్టర్ అయితే.. పెళ్లికాక ముందే ఎవరితో అయినా అనే ప్రశ్నకు 120 మంది పైనే అంటే షాకింగ్ ఆన్సర్ ఇచ్చాడు. మొత్తంగా మెల్లగా బోల్డ్ టాస్క్ మొదలవుతున్నాయని బిగ్ బాస్ హింట్ ఇస్తే కంటెస్టెంట్స్ మేము రెడీ రెచ్చిపోతాం అన్నట్లు స్టేట్మెంట్స్ ఇచ్చేశారు.
