Bigg Boss OTT Telugu: హౌస్ నిండా బోల్డ్ బ్యూటీస్.. బిగ్‌బాస్ ఏం స్కెచ్ వేశాడో?

నో కామా.. నో ఫుల్‌స్టాప్.. బిగ్‌బాస్ అయింది ఇక నాన్‌స్టాప్ అంటూ 24 గంటల పాటు పూర్తి స్థాయి వినోదాన్ని పంచడానికి ఓటీటీ బిగ్ బాస్ తెలుగు రెడీ అయ్యింది. ఫిబ్రవరి 26 నుంచి డిస్నీ..

Bigg Boss OTT Telugu: హౌస్ నిండా బోల్డ్ బ్యూటీస్.. బిగ్‌బాస్ ఏం స్కెచ్ వేశాడో?

Bigg Boss Ott Telugu

Bigg Boss OTT Telugu: నో కామా.. నో ఫుల్‌స్టాప్.. బిగ్‌బాస్ అయింది ఇక నాన్‌స్టాప్ అంటూ 24 గంటల పాటు పూర్తి స్థాయి వినోదాన్ని పంచడానికి ఓటీటీ బిగ్ బాస్ తెలుగు రెడీ అయ్యింది. ఫిబ్రవరి 26 నుంచి డిస్నీ హాట్ స్టార్‌లో ఈ షో ప్రసారం మొదలైంది. దీంతో మరోసారి తెలుగు రాష్ట్రాలలో బిగ్ బాస్ సందడి మొదలైంది. ఈసారి నాన్ స్టాప్ ఎంటెర్టైన్మెంట్ ఇస్తామంటూ ఇప్పటికే 17 మంది కంటెస్టెంట్లు ఇంట్లోకి వెళ్లారు. వాళ్ళలో 8 మంది కొత్త వాళ్ళు కాగా మిగతా వాళ్ళు పాత వాళ్ళే.

Bigg Boss OTT Telugu: 8 మంది కొత్త కంటెస్టెంట్ల బ్యాక్ గ్రౌండ్ ఇదే!

అయితే.. ఓటీటీ బిగ్ బాస్ కంటెస్టెంట్లను చూస్తే ఈసారి బిగ్ బాస్ గట్టి ప్లాన్ వేసినట్లుగా కనిపిస్తుంది. హౌస్ లో ఎటు చూసినా ఫుల్ కలరింగ్ తో పాటు బోల్డ్ బ్యూటీస్ కనిపిస్తున్నారు. అషురెడ్డి, సరయు, ముమైత్ ఖాన్, అరియనా, శ్రీరాపాక, తేజస్వి ముదివాడ, హమీదా, స్రవంతి చొక్కారపు, మిత్ర శర్మ, బిందుమాధవి ఇలా మొత్తం 17 మందిలో 9 మంది లేడీ కంటెస్టెంట్లను ఇంట్లోకి పంపగా అందులో ఒకరిద్దరు మినహా అంతా గ్లామర్ షోకు ఎలాంటి మొహమాటాలు లేని వాళ్ళే.

Bigg Boss OTT Telugu: పాత వాళ్ళు వారియర్స్.. కొత్త వాళ్ళు చాలెంజర్స్!

వర్మ బ్యూటీలుగా వెలుగులోకి వచ్చిన శ్రీరాపాక, అరియనా ఇప్పటికే ఇంట్లో మేల్ కంటెస్టెంట్లతో పాటు ప్రేక్షకులకు గాలమేయడం మొదలు పెట్టగా.. అషురెడ్డి, ముమైత్ ఖాన్, హమీదాల నుండి ఎలా గ్లామర్ పిండుకోవాలో బిగ్ బాస్ కి మనం చెప్పాల్సిన పనిలేదు. మిత్ర శర్మ నటిగానే కాకుండా నిర్మాతగా కూడా ప్రేక్షకులకు ఏం కావాలో.. ముఖ్యంగా యూత్ ను ఎలా ఆకట్టుకోవాలో బాగా తెలుసు. ఇప్పటికే ఆమె సినిమాలలో చూపించేసింది కూడా. ఇక స్రవంతి చొక్కారపు కూడా తక్కువేం కాదు.. ఇంటర్వ్యూలతో మత్తు చల్లడంలో బాగానే నేర్పరి.

Bigg Boss OTT Telugu: నాన్‌స్టాప్ బిగ్‌బాస్ 17 మంది కంటెస్టెంట్లు వీళ్ళే!

గడిచిన నాలుగు రోజులలో ఎవరికి వారు వాళ్ళ రేంజ్ లో షో మొదలు పెట్టగా.. ఉన్న వాళ్ళలో సీనియర్ హీరోయిన్ బిందు మాధవి మాత్రం కొంచెం ఇబ్బందిగానే పద్ధతిగా ఉంటుంది. మరి బిగ్ బాస్ ఆమెకి కూడా ఏమైనా సలహాలు, సూచనలు ఇస్తాడో.. లేక ఆమెని అలాగే ఉంచుతాడో చూడాల్సి ఉండగా.. అసలు ముందు ముందు వీళ్ళతో ఈసారి బిగ్ బాస్ ఎలాంటి డోస్ ఇవ్వబోతున్నాడోనని బుల్లితెర ప్రేక్షకులు చర్చించుకుంటున్నారు.