సరిలేరు నీకెవ్వరు సక్సెస్: రష్మిక ఇంట్లో ఐటీ సోదాలు

  • Published By: vamsi ,Published On : January 16, 2020 / 06:10 AM IST
సరిలేరు నీకెవ్వరు సక్సెస్: రష్మిక ఇంట్లో ఐటీ సోదాలు

Updated On : January 16, 2020 / 6:10 AM IST

టాలీవుడ్‌లో వరుస సినిమాలతో దూసుకుపోతున్న కన్నడ హీరోయిన్ రష్మిక మందనా ఇప్పుడు క్రేజీ హీరోయిన్‌గా మారిపోయింది. ఇటీవ సరిలేరు నీకెవ్వరు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ అమ్మడు ఆ సక్సెస్ ఎంజాయ్ చేస్తుండగానే అనుకోని షాక్ ఎదురైంది. 

ఆమె సొంత రాష్ట్రం కర్ణాటకలోని కొడగు జిల్లాలోని విరాజ్‌పేట శివార్లలో ఉన్న ఇంట్లో గురువారం(16 జనవరి 2020) ఉదయం ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడి చేశారు. బెంగళూరు నుంచి వచ్చిన అధికారులు రష్మికకు సంబంధించిన బ్యాంక్, ఆస్తి వివరాలను పరిశీలిస్తున్నారు. రష్మిక సినిమా షూటింగ్ లో బిజీగా ఉండగా.. ప్రస్తుతం ఇంట్లో లేదు.

 ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో నటనకు గాను ఆమెకు ప్రశంసలు అందుతున్న సమయంలోనే ఈ ఐటీ దాడులు జరగడం విశేషం. ప్రస్తుతం ఈ భామ తెలుగుతో పాటు కన్నడలో హీరోయిన్‌గా దూసుకుపోతుంది. అల్లు అర్జున్ సుకుమార్ సినిమాలో రష్మికకు అవకాశం వచ్చినట్లు తెలుస్తుంది.