Ram Gopal Varma: సూపర్, మెగా, బాహుబలిని మించిన మహాబలి జగన్ -రామ్ గోపాల్ వర్మ
ఆంధ్రప్రదేశ్‌లో సినిమా సమస్యలపై చిరంజీవితో పాటు మహేష్ బాబు, ప్రభాస్‌తో పాటు పలువురు దర్శకులు వెళ్లి సీఎం జగన్‌తో చర్చించారు.
- vamsi
- Published on- February 11, 2022 / 11:10 AM IST
Rgv Jagna
Ram Gopal Varma: ఆంధ్రప్రదేశ్‌లో సినిమా సమస్యలపై చిరంజీవితో పాటు మహేష్ బాబు, ప్రభాస్‌తో పాటు పలువురు దర్శకులు వెళ్లి సీఎం జగన్‌తో చర్చించారు. ఈ సమావేశంపై ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ స్పందించారు.
మెగాస్టార్ చిరంజీవితో పాటు మహేష్ బాబు, ప్రభాస్, దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి, కొరటాల శివ వెళ్లడంపై ట్విట్టర్లో ట్వీట్ ద్వారా స్పందించారు.
“సూపర్, మెగా, బాహుబలి లెవెల్ బెగ్గింగ్ వల్ల ఈ మీటింగ్ జరిగినప్పటికీ, ఒమేగా స్టార్‌ని వైఎస్ జగన్ ఆశీర్వదించినందుకు నేను సంతోషిస్తున్నాను. సూపర్, మెగా, బాహుబలిని మించిన మహాబలి జగన్‌ని నేను అభినందిస్తున్నాను” అంటూ ట్వీట్ చేశారు.
అంతకుముందు రామ్ గోపాల్ వర్మ ఓ ట్వీట్ వేసి డిలీట్ చేశారు. ‘ఓ మెగా అభిమానిగా ఈ మెగా బెగ్గింగ్ చూసి చాలా హర్ట్ అయ్యా’ అంటూ ట్వీట్ చేశారు. తర్వాత కాసేపటికే డిలీట్ చేశారు. ఇదిలా ఉంటే సమావేశం జరిగిన వారంలోనే సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని భావిస్తున్నారు.
