Allu Arjun Appreciated NTR Cousin Narne Nithiin Bunny Shirt goes Viral
Allu Arjun : ఎన్టీఆర్ బామ్మర్ది నార్నె నితిన్ ఇటీవల ఆయ్ సినిమాతో వచ్చి మంచి హిట్ కొట్టాడు. ఫ్రెండ్షిప్, లవ్ నేపథ్యంలో గోదావరి బ్యాక్ డ్రాప్ తో వచ్చిన ఆయ్ సినిమా ప్రేక్షకులని మెప్పించి మంచి విజయం సాధించి ఇప్పటికే ఆల్మోస్ట్ 5 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. దీంతో పలువురు సినీ ప్రముఖులు ఆయ్ సినిమా మూవీ యూనిట్ ని అభినందిస్తున్నారు. ఇప్పటికే ఎన్టీఆర్ కూడా ఆయ్ సినిమా టీమ్ ని ప్రత్యేకంగా అభినందించారు.
Also Read : Prabhas Heroins : స్టార్ హీరోయిన్స్‌ని దూరం పెడుతున్న ప్రభాస్..? ఒకప్పుడు అలా.. ఇప్పుడు ఇలా..
ఈ సినిమాని GA 2 బ్యానర్ పై అల్లు అర్జున్ స్నేహితుడు బన్నీ వాసు నిర్మించాడు. దీంతో తాజాగా ఎన్టీఆర్ బామ్మర్ది నార్నె నితిన్ ని, ఆయ్ సినిమా యూనిట్ ని, బన్నీ వాసుని అల్లు అర్జున్ ప్రత్యేకంగా అభినందించారు. ఈ క్రమంలో ఆయ్ సినిమా యూనిట్ తో అల్లు అర్జున్ దిగిన ఫొటోలు వైరల్ గా మారాయి.
#AAYFunFestival Oopu Assalu #ThaggedheLe ?
Team #AAYMovie meets Pushpa Raj #AlluArjun❤️?
Icon stAAr @alluarjun garu congratulated the entire team of #AAY on the massive success??
Book Your Tickets Now for the Blockbuster Entertainment!
? https://t.co/9L1CW3DmAg pic.twitter.com/YDaiVi2cVr— Vamsi Kaka (@vamsikaka) August 21, 2024
అయితే ఈ ఫొటోల్లో అల్లు అర్జున్ వేసుకున్న షర్ట్ ఇప్పుడు చర్చగా మారింది. అల్లు అర్జున్ షర్ట్ పై అమ్మవారి ముఖ చిత్రంలాగా ప్రింట్ ఉందంటున్నారు. కొంతమంది సాంప్రదాయంగా రెడీ అయిన అమ్మాయి ఫొటోలాగా ఉందంటున్నారు. పుష్ప సినిమాలో అల్లు అర్జున్ గంగమ్మ జాతర కోసం లేడి గెటప్ వేసిన సంగతి తెలిసిందే. ఆ గెటప్ కి సంబంధిన ఫేస్ లాగే అల్లు అర్జున్ షర్ట్ మీద ప్రింట్ చేయించారని, ఆ షర్ట్ చూస్తుంటే బాగా అలంకరించుకున్న అమ్మాయి ముఖమే గుర్తొస్తుందని పలువురు కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి అల్లుఅర్జున్ వేసిన షర్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది.