Site icon 10TV Telugu

Big Boss 8 : బిగ్ బాస్ ఫైనల్ ఎపిసోడ్ కి గెస్ట్ గా ఐకాన్ స్టార్.. విన్నర్ కి ట్రోఫీ అందించేది బన్నీనేనా..

Icon star Allu Arjun as guest for Bigg Boss 8 final episode

Icon star Allu Arjun as guest for Bigg Boss 8 final episode

Big Boss 8 : బిగ్ బాస్ సీజన్ 8 రసవత్తరంగా కొనసాగుతుంది. ఎన్నో అద్భుతమైన టాస్క్ లు, ఎన్నో జ్ఞాపకాలతో మరికొన్ని రోజుల్లో ఈ షో పూర్తవబోతుంది. ఊహించని విధంగా వైల్డ్ కార్డు ఎంట్రీలతో, సీజన్ అంతా అన్‌లిమిటెడ్ ట్విస్టులు, అన్‌లిమిటెడ్ ఫన్ తో సాగిన బిగ్ బాస్ సీజన్ 8 గత సీజన్స్ కంటే ఎక్కువ రేటింగ్ తెచ్చుకుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇలా చివరికి చేరుకున్న ఈ సీజన్ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ త్వరలోనే ఉండబోతుంది.

అయితే ఈ సీజన్ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ కి ఐకాన్ సార్ అల్లు అర్జున్ విజేతకు ట్రోఫీ అందించటానికి రానున్నట్టు సమాచారం. దీనికి సంబంధించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున్న వార్తలు వస్తున్నాయి. కానీ బిగ్ బాస్ నిర్వాహకులు మాత్రం దీనిపై అధికారిక ప్రకటన ఇవ్వలేదు. మరి పుష్ప 2 సినిమాతో బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ బ్రేక్ చేసిన అల్లు అర్జున్ ఈ షోకి చీఫ్ గెస్ట్ గా వస్తాడా లేదా అన్నది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాలి.

Also Read : Lakshmi Manchu : మంచు ఇంట ముదురుతున్న వివాదం.. గోడపై స్పందించని మంచు లక్ష్మి ఆ పోస్ట్ ఎందుకు చేసినట్టు..

ఇక ఇప్పటికే గత సీజన్స్ విన్నర్స్ కి ట్రోఫీ అందించడానికి పలువురు సినీ సెలబ్రిటీస్ వచ్చారు. గత సీజన్ కి మాత్రం చీఫ్ గెస్ట్ రాలేదు. నాగార్జుననే విన్నర్ కి ట్రోఫీ అందించారు. గత సీజన్ కి కూడా సెలబ్రిటీ ఎవ్వరు రాకపోవడంతో ఈ సీజన్ కి పెద్ద స్టార్ ని తీసుకురావాలి నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. అందుకే ఈ సీజన్ కి అల్లు అర్జున్ ను తీసుకొస్తునట్టు తెలుస్తుంది.

Exit mobile version