Lakshmi Manchu : మంచు ఇంట ముదురుతున్న వివాదం.. గొడవపై స్పందించని మంచు లక్ష్మి ఆ పోస్ట్ ఎందుకు చేసినట్టు..
మంచు కుటుంబం మొత్తం ఈ గొడవలతో చెల్లాచెదురైతే మంచు లక్ష్మి మాత్రం ఇప్పటి వరకు దీనిపై స్పందించింది లేదు.

Manchu Lakshmi shared a shocking post during Manchu family clashes
Lakshmi Manchu : మంచు కుటుంబంలో జరుగుతున్న గొడవల గురించి తెలిసిందే. మంచు గొడవలు పోలీస్ స్టేషన్ వరకు చేరాయి. తండ్రి కొడుకులు ఒకరిపై ఒకరు కేసు పెట్టుకోవడం, ఒకరి పై ఒకరు దాడి చేసుకోవడం, హాస్పిటల్ లో చేరడం ఇలా రోజుకొక వార్తతో గత కొన్ని రోజులుగా మంచు ఫామిలీ రోడ్డుకెకెక్కింది. ఈ గొడవల వల్ల మోహన్ బాబు భార్య కూడా అనారోగ్యానికి గురైంది. ఇలా మంచు కుటుంబం మొత్తం ఈ గొడవలతో చెల్లాచెదురైతే మంచు లక్ష్మి మాత్రం ఇప్పటి వరకు దీనిపై స్పందించింది లేదు.
Also Read : Sai Pallavi : ‘ఇక సహించేది లేదు’.. ఆ రూమర్స్ పై సాయి పల్లవి ఫైర్..
మరి ఇప్పటికైనా దీనిపై మంచు లక్ష్మి నోరు విప్పుతుందా లేదా అన్న చర్చల నేపథ్యంలో తాజాగా తన సోషల్ మీడియా వేదికగా ఒక షాకింగ్ పోస్ట్ షేర్ చేసింది. డైరెక్ట్ గా ఈ విషయంపై స్పందించనప్పటికీ ఇండైరెక్ట్ గా చెప్పింది.. తన సోషల్ మీడియాలో ఇలా రాసుకొచ్చింది..” ఈ ప్రపంచంలో ఏదీ నీది కాదు అన్నప్పుడు.. ఏదో కోల్పోతావన్న బాధ నీకెందుకు’ అంటూ ఒక నోట్ రాసింది. మంచు ఇంట వివాదాల వేళ మంచు లక్ష్మి ఇలాంటి పోస్ట్ ఎందుకు.. ఎవరిని ఉద్దేశించి పెట్టింది అన్న అనుమానాలు నెలకొన్నాయి.
— Manchu Lakshmi Prasanna (@LakshmiManchu) December 12, 2024
అంతేకాకుండా మంచు ఇంట గొడవల నేపథ్యంలో అసలు ఆమె మోహన్ బాబు ఇంట్లోనే లేనట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఆమె ముంబైలో ఉన్నట్టు తెలుస్తుంది. ఇటీవల మోహన్ బాబు మనోజ్ కి గొడవలు జరుగుతున్న సమయంలో ఆమె ముంబైలో ఉన్నట్టు ఒక పోస్ట్ కూడా షేర్ చేసింది. దీంతో రకరకాల అనుమానాలు నెలకొన్నాయి. మరి ఇంకముందైనా మంచు లక్ష్మి ఈ వార్తలపై నేరుగా స్పందిస్తుందా , అసలు ఆమె ఎవరికి సపోర్ట్ చేస్తుంది అన్నది చూడాలి.