Sai Pallavi : ‘ఇక సహించేది లేదు’.. ఆ రూమర్స్ పై సాయి పల్లవి ఫైర్..

ఇన్ని రోజులు ఈ వార్తలపై స్పందించని సాయి పల్లవి తన సహనాన్ని కోల్పోయింది. ఎట్టకేలకు ఈ వార్తలకి చెక్ పెట్టింది.

Sai Pallavi : ‘ఇక సహించేది లేదు’.. ఆ రూమర్స్ పై సాయి పల్లవి ఫైర్..

Sai Pallavi gave clarity on those rumours

Updated On : December 12, 2024 / 8:53 AM IST

Sai Pallavi : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సాయి పల్లవి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇప్పటికే ఎన్నో సినిమాల్లో నటించి భారీ గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ ఇటీవల అమరన్ సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతలోకి వేసుకుంది. ఇక ఈ సినిమా తర్వాత త్వరలోనే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న గేమ్ ఛేంజర్ సినిమాతో ఆడియన్స్ ముందుకు రానుంది. అలాగే బాలీవూడ్ లో కూడా రామాయణ సినిమా చేస్తుంది.

అయితే సాయి పల్లవి ఈ సినిమా కోసం తన చాలా అలవాట్లను మార్చుకుందని.. ఈ సినిమాలో సీత పాత్ర పోషిస్తునందుకు ఆమె నాన్ వెజ్ మానేసిందని.. పూర్తిగా వెజ్ మాత్రమే తింటుందని.. అంతేకాదు ఇతర దేశాలకు వెళ్లేటప్పుడు కూడా తన చెఫ్‌ల బృందాన్ని తనతో తీసుకువెళుతుందని పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. ఇన్ని రోజులు ఈ వార్తలపై స్పందించని సాయి పల్లవి తన సహనాన్ని కోల్పోయింది. ఎట్టకేలకు ఈ వార్తలకి చెక్ పెట్టింది.

Also Read : Mohan Babu Family Clashes : పెదరాయుడి ఇంట్లో ఏం జరుగుతోంది? మోహన్ బాబు, మనోజ్ మధ్య అసలు వివాదం ఏమిటి?

తాజాగా తన సోషల్ మీడియా వేదికగా ఇలా రాసుకొచ్చింది…” చాలా సార్లు, దాదాపు ప్రతిసారీ, నేను నిరాధారమైన పుకార్లు, కల్పిత అబద్ధాలు/ తప్పుడు ప్రకటనలు ఉద్దేశ్యంతో లేకుండా వ్యాప్తి చెందడాన్ని చూసినప్పుడల్లా మౌనంగా ఉండటానికి ప్రయత్నిస్తాను. కానీ ఇప్పుడు అస్సలు అలా ఊరుకోను. ఏదైనా పేరున్న మీడియా లేదా పేజీ నాపై తప్పుడు పుకార్లు రాసినా, చెప్పినా, మౌనంగా ఉండబోనని, ఒకవేళ అలా జరిగితే కచ్చితంగా చట్టపరంగా ఎదుర్కొంటానని సాయిపల్లవి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. దీంతో సాయి పల్లవి చేసిన ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.