Site icon 10TV Telugu

Pushpa 2 : ‘పుష్ప 2’ సరికొత్త రికార్డు.. బాక్సాఫీస్ వ‌ద్ద ఆగేదేలే..

Icon Star Allu Arjun Pushpa 2 the rule collects RS 800 CR at hindi box office

Icon Star Allu Arjun Pushpa 2 the rule collects RS 800 CR at hindi box office

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ న‌టించిన పుష్ప 2 మూవీ డిసెంబ‌ర్ 5న ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. విడుద‌లైన నాటి నుంచి ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద వ‌రుస రికార్డులు సృష్టిస్తోంది. తాజాగా మ‌రో రికార్డును త‌న ఖాతాలో వేసుకుంది. హిందీలో రూ.806 కోట్ల నెట్ వ‌సూళ్లు సాధించింది. ఈ ఘ‌న‌త సాధించిన తొలి చిత్రంగా స‌రికొత్త చ‌రిత్ర సృష్టించింది.

కేవ‌లం 31 రోజుల్లోనే పుష్ప 2 మూవీ 800 కోట్ల క్ల‌బ్‌లో చేర‌డం విశేషం. ఈ విష‌యాన్ని సోష‌ల్ మీడియా వేదిక‌గా చిత్ర బృందం తెలియ‌జేసింది. ఓ స్పెష‌ల్ ప్రొమోను విడుద‌ల చేసింది. దీనిపై అల్లు అర్జున్ అభిమానులు ఆనందాన్ని వ్య‌క్తం చేస్తున్నారు.

Aditi Shankar : డైరెక్టర్ శంకర్ తో కూతురు అదితి శంకర్ పోటీ.. సంక్రాంతి బరిలో గేమ్ ఛేంజర్ కు పోటీగా..

సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రంలో ర‌ష్మిక క‌థానాయిక‌. ఫ‌హాల్ ఫాజిల్‌, అన‌సూయ‌, సునీల్ లు కీల‌క పాత్ర‌లో న‌టించారు. బాక్సాఫీస్ వ‌ద్ద క‌లెక్ష‌న్ల సునామీ సృష్టిస్తూ కేవ‌లం 28 రోజుల్లో రూ.1799 కోట్ల‌కు పైగా గ్రాస్ వ‌సూళ్ల‌ను సాధించిన‌ట్లు ఇటీవ‌ల చిత్ర బృందం తెలిపింది. ఇక ఓవ‌ర్‌సీస్‌లోనూ పుష్ప‌రాజ్ హ‌వా కొన‌సాగుతోంది. నార్త్ అమెరికాలో 15 మిలియన్ డాలర్లకు పైగా వసూళ్లతో దూసుకెళ్తోంది.

Allu Arjun : అల్లు అర్జున్ బాలీవుడ్ లో సినిమా చేస్తున్నాడా? బన్నీతో సినిమా కోసం బాలీవుడ్ మేకర్ల ఆసక్తి..

టీకెట్ల విక్ర‌మంలో పుష్ప 2 స‌రికొత్త రికార్డు సృష్టించిన సంగ‌తి తెలిసిందే. బుక్ మై షోలో 19.5 మిలియ‌న్ టికెట్లు విక్ర‌య‌మ‌య్యాయి. ఈ క్ర‌మంలో బాహుబ‌లి 2 పేరిట ఉన్న రికార్డును పుష్ప 2 బ‌ద్ద‌లు కొట్టింది.

Exit mobile version