ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తల్లి నిర్మల పుట్టిన రోజు నేడు (జూన్ 21). ఈ క్రమంలో ఆమెకు బన్నీ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. తన తల్లితో ఉన్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ బర్త్ డే విషెస్ చెప్పారు.
ప్రస్తుతం ఈ పిక్ వైరల్ అవుతుండగా, అభిమానులతో పాటు నెటిజన్లు నిర్మలకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
Sathi Leelavathi : ‘సతీ లీలావతి’ ఫస్ట్‌లుక్ వచ్చేసింది.. మెగా కోడలు లుక్ చేశారా?
ఇక సినిమాల విషయానికి వస్తే.. అల్లు అర్జున్ ప్రస్తుతం తమిళ దర్శకుడు అట్లీ డైరెక్షన్‌లో ఓ మూవీలో నటిస్తున్నారు. సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
AA26xA6 అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ చిత్రం తెరకెక్కుతోంది. దీపికా పదుకోన్ కథానాయికగా నటిస్తోంది. పలువురు స్టార్ నటీనటులు నటిస్తున్న ఈ చిత్రం హాలీవుడ్ రేంజ్ లో ఉంటుందనే టాక్.