Sathi Leelavathi : ‘సతీ లీలావతి’ ఫస్ట్‌లుక్ వచ్చేసింది.. మెగా కోడలు లుక్ చేశారా?
లావణ్య త్రిపాఠి, దేవ్ మోహన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం సతీ లీలావతి.

Lavanya Tripathi Sathi Leelavathi First Look out now
లావణ్య త్రిపాఠి, దేవ్ మోహన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం సతీ లీలావతి. తాతినేని సత్య దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ సమర్పణలో దుర్గాదేవి పిక్చర్స్ బ్యానర్‌పై నాగమోహన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మిక్కీ జె.మేయర్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్ర ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్ ఆకట్టుకుంటుంది.
ఫస్ట్ లుక్ విడుదల సందర్భంగా దర్శకుడు తాతినేని సత్య మాట్లాడుతూ…మనుషుల మధ్య ఎమోషన్స్ లేకపోవడంతోనే నేటి కాలంలో కుటుంబ వ్యవస్థ బలహీన పడుతోందన్నారు. భావోద్వేగాలే బంధాలను కలకాలం నిలుపుతాయన్నారు. రెండు వేర్వేరు కుటుంబాలు, నేపథ్యాల నుంచి వచ్చిన వ్యక్తులు కలిసి ప్రయాణించాలంటే వారి మధ్య ఎమోషన్స్ ఇంకెంత బలంగా ఉండాలో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదన్నారు.
HariHara VeeraMallu : ‘హరిహర వీరమల్లు’ కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది.. ఈసారి విలన్ తో కొత్త పోస్టర్..
ఇలాంటి సున్నితమైన అంశంతో ఈ చిత్రం తెరకెక్కుతోందని చెప్పుకొచ్చారు. భార్య, భర్త మధ్య ఉండే అనుబంధాన్ని ఎమోషనల్‌గానే కాకుండా ఎంటర్ టైనింగ్‌గానూ చూపించనున్నట్లు తెలిపారు. ఇప్పటికే ఈ చిత్రీకరణ పూరైందని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయన్నారు. ఇదొక ఫీల్ గుడ్ మూవీ అని, అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందన్నారు.
హీరో వరుణ్ తేజ్ భార్య, మెగా కోడలు అయిన లావణ్య త్రిపాఠి పెళ్లి తరువాత నటిస్తున్న చిత్రం కావడంతో ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి.