AKKINENI HEROS : ఫుల్ ఫామ్‌లో దూసుకుపోతున్న అక్కినేని హీరోలు.. మొన్న చైతు, ఇవాళ నాగ్‌, రేపు అఖిల్‌.. !

భారీ అంచనాల మధ్య థియేటర్స్‌లోకి వచ్చిన కుబేర హిట్‌ టాక్‌తో దూసుకుపోతోంది.

AKKINENI HEROS : ఫుల్ ఫామ్‌లో దూసుకుపోతున్న అక్కినేని హీరోలు.. మొన్న చైతు, ఇవాళ నాగ్‌, రేపు అఖిల్‌.. !

AKKINENI HEROS SUCCESS TRACK

Updated On : June 20, 2025 / 9:45 PM IST

భారీ అంచనాల మధ్య థియేటర్స్‌లోకి వచ్చిన కుబేర హిట్‌ టాక్‌తో దూసుకుపోతోంది. ఈ సినిమాలో కీ రోల్‌ ప్లే చేసిన అక్కినేని నాగార్జున ఖాతాలో లాంగ్‌ గ్యాప్‌ తర్వాత సక్సెస్‌ వచ్చి చేరింది. ఇలా కుబేరతో నాగ్‌, తండేల్‌తో చైతూ హిట్టు కొట్టడం.. అఖిల్‌ పెళ్లిపీటలు ఎక్కడం ఇలా.. ఒక్కసారిగా పాజిటివ్‌ ఫామ్‌లోకి వచ్చేశారు ఈ అక్కినేని హీరోలు.

అక్కినేని నాగార్జున ఖాతాలోకి హిట్టు వచ్చి చేరింది. డైరెక్టర్‌ శేఖర్‌ కమ్ముల తెరకెక్కించిన కుబేర సినిమాలో వన్‌ ఆఫ్‌ ది లీడ్‌ క్యారెక్టర్‌లో నటించారు నాగార్జున. సినిమాలోని తన రోల్‌కి అక్కినేని ఫ్యాన్స్‌ నుంచే కాదు.. ఆడియెన్స్‌ నుంచి అమేజింగ్‌ రెస్పాన్స్‌ వస్తోంది. సోగ్గాడే చిన్నినాయన, ఊపిరి, బంగార్రాజు సినిమాల తర్వాత సరైన సక్సెస్‌ లేని నాగార్జునకి కుబేర సినిమాతో పాన్‌ ఇండియా హిట్‌ దక్కింది. దీంతో త్వరలో రిలీజ్‌కి రెడీగా ఉన్న కూలీ సినిమాపై ఎక్స్‌పెక్టేషన్స్‌ పెరిగిపోతున్నాయి అక్కినేని అభిమానుల్లో. అంతేకాదు ఇదే జోష్‌లో తన వందవ సినిమాకి సంబంధించి.. ఫ్యాన్స్‌కి అదిరిపోయే ట్రీట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు నాగార్జున.

Dhanush : తిరుపతి రోడ్ల మీద రియల్ బిచ్చగాడిలా ‘ధనుష్’.. ఈ పాట విన్నారా? ఏడవటం ఖాయం..

అక్కినేని నాగ చైతన్య కూడా తండేల్‌ సినిమాతో సాలిడ్‌ కంబ్యాక్‌ ఇచ్చారు. ఇటు బ్రేకప్‌ తర్వాత లాస్ట్‌ ఇయర్‌ డిసెంబర్ 4న శోభిత ధూళిపాళతో కొత్త లైఫ్‌ని స్టార్ట్ చేసిన నాగ చైతన్యకి.. తండేల్‌ బ్లాక్ బాస్టర్‌ సక్సెస్ తీసుకొచ్చింది. సాయిపల్లవి హీరోయిన్‌గా నటించిన ఈ లవ్‌ ఎంటర్‌టైనర్‌ సినిమాతో.. 100 కోట్ల కలెక్షన్స్‌ రాబట్టిన క్లబ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు చైతూ. తండేల్ సక్సెస్‌ జోష్‌తో కార్తిక్‌ వర్మ డైరెక్షన్‌లో చేస్తోన్న NC24 సినిమాతో పాన్‌ ఇండియా మార్కెట్‌లోకి ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు నాగ చైతన్య.

ఈ పాజిటివ్‌ వైబ్స్‌ అక్కినేని అఖిల్‌ లైఫ్‌లోకి ఎంట్రీ ఇచ్చాయి. నాగార్జున, చైతన్య సినిమా పరంగా సక్సెస్‌ ట్రాక్‌లోకి వస్తే.. అఖిల్‌ మాత్రం తన లైఫ్‌ పార్ట్‌నర్ జైనబ్ రవ్జీతో ఏడడుగులు నడిచి వివాహబంధంలోకి అడుగుపెట్టారు. అఖిల్‌, జైనబ్‌ రవ్జీల మ్యారేజ్‌ ఈ నెల 6న కొద్దిమంది సెలబ్రిటీలు.. చాలా క్లోజ్డ్‌ రిలేటివ్స్‌ మధ్య గ్రాండ్‌గా జరిగింది. ఇటు కెరీర్‌లో ఇప్పటివరకు సాలిడ్‌ హిట్‌ లేని అక్కినేని అఖిల్‌.. లెనిన్‌ సినిమా తనకు సక్సెస్‌ తీసుకువస్తుందని చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. ఇలా అక్కినేని హీరోల లైఫ్‌లోకి సక్సెస్.. పాజిటివ్‌ వైబ్స్ రావడంతో హ్యాపీగా ఫీల్‌ అవుతున్నారు అభిమానులు.