Dhanush : తిరుపతి రోడ్ల మీద రియల్ బిచ్చగాడిలా ‘ధనుష్’.. ఈ పాట విన్నారా? ఏడవటం ఖాయం..
సినిమాలో ధనుష్ అద్భుతంగా నటించాడు. బిచ్చగాడి పాత్రలో జీవించేసాడు.

Dhanush Acted as Beggar in Kuberaa Movie gives Best Performance
Dhanush : సినిమా కోసం ఎలాంటి పాత్ర అయినా పోషించే నటుల్లో ధనుష్ ఒకరు. ఇప్పటికే నేషనల్ అవార్డు విన్నర్ కూడా. తాజాగా ధనుష్ కుబేర సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగార్జున, ధనుష్, రష్మిక కీలక పాత్రల్లో తెరకెక్కిన కుబేర సినిమా నేడు రిలీజయింది. ఈ సినిమాలో ధనుష్ బిచ్చగాడిలా నటించాడు.
సినిమాలో ధనుష్ అద్భుతంగా నటించాడు. బిచ్చగాడి పాత్రలో జీవించేసాడు. సినిమా చూసిన వాళ్లంతా ధనుష్ ని తెగ పొగిడేస్తున్నారు. ఈ సినిమాతో ధనుష్ కి మరో నేషనల్ అవార్డు పక్కా అంటున్నారు. అయితే ఈ సినిమాలో ధనుష్ బిచ్చగాడుగా చేసిన పాత్రను రియల్ లొకేషన్స్ లోనే షూట్ చేసారు. తిరుపతిలో రియల్ లొకేషన్స్ లో ధనుష్ బిచ్చగాడి గెటప్ లో అడుక్కున్నాడు, పరిగెత్తాడు. ముంబైలో కూడా ధనుష్ రియల్ లొకేషన్స్ లో అడుక్కున్నాడు.
ఈ విషయం స్వయంగా ధనుష్, శేఖర్ కమ్ముల తెలిపారు. తాజాగా ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన ఒక ఎమోషనల్ సాంగ్ లో కూడా మేకింగ్ విజువల్స్ చూపించారు. తిరుపతిలో షూట్ చేస్తున్న విజువల్స్ చూపించారు. అలాగే మేకింగ్ వీడియో కూడా రిలీజ్ చేసారు. ఈ సాంగ్, మేకింగ్ వీడియోలో ధనుష్ ని చూసి ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు. మామూలు సీన్స్ నే సెట్స్ లో చేసే స్టార్ హీరోలు ఉన్న సమయంలో ఒక స్టార్ హీరో అయి ఉండి అడుక్కోవడం రియల్ గా రియల్ లొకేషన్స్ లో చేసాడు అంటే గ్రేట్ అని అభినందిస్తున్నారు. ఇక ‘నా కొడకో..’ అంటూ సాగిన ఈ సాంగ్ కూడా ఎమోషనల్ గా ఉంది. మీరు కూడా సాంగ్ వినేయండి..
కుబేర మేకింగ్ వీడియో కూడా చూసేయండి..
Also Read : Nara Bhuvaneswari : హ్యాపీ బర్త్ డే పెద్ద అత్తయ్య.. సీఎం చంద్రబాబు భార్యకు హీరోయిన్ స్పెషల్ విషెస్..