Pawan Kalyan Unstoppable : రేపే పవన్ అన్‌స్టాపబుల్ ఎపిసోడ్.. క్రిమినల్ చర్యలు తీసుకుంటాము అంటున్న మేకర్స్!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్‌స్టాపబుల్ కి వస్తున్నాడు అని తెలిసిన దగ్గర నుంచి ఆ ఎపిసోడ్ ఎప్పుడు రిలీజ్ అవుతుందా? ఎప్పుడు చూస్తామా? అని ఎదురు చూస్తున్నారు ప్రేక్షకులు. క ఈ ఎపిసోడ్ ని ఫిబ్రవరి 3న రిలీజ్ చేస్తామంటూ ప్రకటించిన మేకర్స్.. క్రేజ్ దృష్ట్యా ఒక రోజు ముందుగానే విడుదల చేయడానికి సిద్ధమయ్యారు. ఈ ఎపిసోడ్ ని రేపు రాత్రి 9 గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. కాగా...
- gum 95921
- Published On : February 1, 2023 / 05:12 PM IST
Pawan Kalyan Unstoppable
Pawan Kalyan Unstoppable : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్‌స్టాపబుల్ కి వస్తున్నాడు అని తెలిసిన దగ్గర నుంచి ఆ ఎపిసోడ్ ఎప్పుడు రిలీజ్ అవుతుందా? ఎప్పుడు చూస్తామా? అని ఎదురు చూస్తున్నారు ప్రేక్షకులు. నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఈ షో.. బాప్ అఫ్ అల్ టాక్ షోస్ అనిపించుకుంటుంది. ముక్కుసూటిగా మాట్లాడే బాలకృష్ణ, ముక్కుసూటిగా వెళ్లే పవన్ కళ్యాణ్ మధ్య సంభాషణలు ఎలా ఉంటాయో చూడడానికి అందరు ఆసక్తి చూపిస్తున్నారు. ఇక ఈ ఎపిసోడ్ ని ఫిబ్రవరి 3న రిలీజ్ చేస్తామంటూ ప్రకటించిన మేకర్స్.. క్రేజ్ దృష్ట్యా ఒక రోజు ముందుగానే విడుదల చేయడానికి సిద్ధమయ్యారు. ఈ ఎపిసోడ్ ని రేపు రాత్రి 9 గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు.
Unstoppable : పవన్ ఫ్యాన్స్‌కి ఇంకొంచెం ముందుగానే పండుగ.. బాలయ్య-పవన్ ఎపిసోడ్ ముందే రిలీజ్..
కాగా నేడు ఆహా టీం ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో కంటెట్ హెడ్ వాసుదేవ మాట్లాడుతూ.. అన్‌స్టాపబుల్ సీజన్ 2ని చంద్రబాబు నాయుడుతో స్టార్ట్ చేసాము. చాలా పెద్ద సక్సెస్ అయ్యింది. ఇటీవల ప్రభాస్ తో ఒక ఎపిసోడ్ చేసాము. అది ఎన్నో మిలియన్ వ్యూస్ సాధించింది. అయితే ప్రభాస్ ఎపిసోడ్ విషయంలో చాలా ఇబ్బందులు ఫేస్ చేసాము. ట్రాఫిక్ కారణంగా యాప్ క్రాష్ అవ్వడం. ఆ సమయంలో ఎపిసోడ్ పైరసీ అయ్యి బయటకి వచ్చేయడం వంటివి జరిగాయి. ఈసారి అలాంటివి జరగకుండా జాగ్రత్తపడుతున్నాము. ఈ ఎపిసోడ్ కి ట్రాఫిక్ జరగకుండా చూస్తున్నాము. అంతేకాదు హై క్వాలిటితో వస్తున్నట్లు ప్రకటించారు.
ఇక ఎవరైనా పైరసి చేయాలని చూస్తే వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు తీసుకుంటాం అంటూ అల్టిమేటం జారీ చేశారు. ఎట్టి పరిస్థితిలో పైరసీ జరగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలియజేశారు. ఇక ఈ ఎపిసోడ్ రెండు భాగాలుగా వస్తున్న సంగతి తెలిసిందే. మొదటి ఎపిసోడ్ లో సినిమాకి సంబంధించిన విషయాలు, రెండో ఎపిసోడ్ లో రాజకీయ పరమైన విషయాలు చర్చకు రానున్నట్లు సమాచారం. కాగా ఈ షోకి పవన్ తో పాటు సాయి ధరమ్ తేజ్, త్రివిక్రమ్ కూడా హాజరు కాబోతున్నారు. రామ్ చరణ్ ఫోన్ కాల్ ద్వారా ఈ షోలో భాగం కానున్నాడు.
