Unstoppable : పవన్ ఫ్యాన్స్‌కి ఇంకొంచెం ముందుగానే పండుగ.. బాలయ్య-పవన్ ఎపిసోడ్ ముందే రిలీజ్..

బాప్ ఆఫ్ ఆల్ ఎపిసోడ్స్ అని పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ ని ఆహా ఫిబ్రవరి 3న రిలీజ్ చేస్తామని ప్రకటించారు. దీంతో అభిమానులు, ప్రేక్షకులు ఈ ఎపిసోడ్ కోసం ఎదురుచూస్తున్నారు. అంతలోనే ఎపిసోడ్ కి మరింత క్రేజ్ తెప్పించాలని ఆహా టీం.................

Unstoppable : పవన్ ఫ్యాన్స్‌కి ఇంకొంచెం ముందుగానే పండుగ.. బాలయ్య-పవన్ ఎపిసోడ్ ముందే రిలీజ్..

Balakrishna Unstoppable Pawan Kalyan Episode releasing on February 2nd

Updated On : February 1, 2023 / 11:59 AM IST

Unstoppable :  బాలయ్య హోస్ట్ గా ఆహా ఓటీటీ లో వస్తున్న అన్‌స్టాపబుల్ షో సక్సెస్ ఫుల్ గా అదూసుకుపోతున్న సంగతి తెలిసిందే. సెకండ్ సీజన్ మరింత పాపులార్ అయింది. ఇక సెకండ్ సీజన్ లో ప్రభాస్ ఎపిసోడ్ తో అన్‌స్టాపబుల్ షో దేశవ్యాప్తంగా మరింత ఫేమ్ తెచ్చుకుంది. ఈ ఎపిసోడ్ తో సరికొత్త రికార్డులు సృష్టించింది ఈ షో.

ఇక బాలయ్య అన్‌స్టాపబుల్ షోకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఎపిసోడ్ షూటింగ్ మొదలయిన దగ్గర్నుంచి బాలయ్య, పవన్ అభిమానులు హంగామా చేస్తూనే ఉన్నారు. ఇప్పటికే ఈ ఎపిసోడ్ కి సంబంధించి ప్రోమో కూడా రిలీజ్ అయింది. ఈ ప్రోమో చాలా సరదాగా, ఆసక్తికరంగా ఉండటంతో వైరల్ గా మారింది. ఈ ఎపిసోడ్ లో పవన్ సినిమాలు, పర్సనల్ లైఫ్, రాజకీయాలు మాట్లాడనున్నారు. ఈ ఎపిసోడ్ కోసం బాలయ్య, పవన్ అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

అయితే బాప్ ఆఫ్ ఆల్ ఎపిసోడ్స్ అని పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ ని ఆహా ఫిబ్రవరి 3న రిలీజ్ చేస్తామని ప్రకటించారు. దీంతో అభిమానులు, ప్రేక్షకులు ఈ ఎపిసోడ్ కోసం ఎదురుచూస్తున్నారు. అంతలోనే ఎపిసోడ్ కి మరింత క్రేజ్ తెప్పించాలని ఆహా టీం ట్విట్టర్ లో ఓ పోస్ట్ పెట్టి దాన్ని పదివేల మంది రీట్వీట్ చేస్తే ముందుగానే ఎపిసోడ్ రిలీజ్ చేస్తామని ప్రకటించారు. ఆ ట్వీట్ ని ఏకంగా 18 వేలమందికి పైగా రీట్వీట్ చేయడంతో బాలయ్య-పవన్ ఎపిసోడ్ ని ఫిబ్రవరి 2న రాత్రి 9 గంటలకే స్ట్రీమింగ్ చేస్తామని ప్రకటించారు. దీంతో అటు బాలకృష్ణ ఫ్యాన్స్, ఇటు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తూ ఎంతో ఆసక్తిగా ఈ ఎపిసోడ్ కోసం ఎదురు చూస్తున్నారు.

Aamir Khan : సల్మాన్ ఖాన్ కోసం ఫొటోగ్రాఫర్‌గా మారిన అమీర్ ఖాన్..

ఇక ఈ ఎపిసోడ్ ని రెండు భాగాలుగా రిలీజ్ చేయనున్నట్టు గతంలోనే ప్రకటించారు. మొదటి పార్ట్ ఫిబ్రవరి 2న రిలీజ్ చేస్తుండగా రెండో పార్ట్ ని ఫిబ్రవరి 10న రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు. ఈ ఎపిసోడ్ ఇంకెన్ని రికార్డులు సెట్ చేస్తుందో చూడాలి. ఇందులో పొలిటికల్ అంశాలు కూడా రానుండటంతో అటు ఏపీ రాజకీయ నాయకులూ కూడా ఈ ఎపిసోడ్ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు.