Ileana : రెండో సారి తల్లి అయిన పోకిరి భామ.. ఈసారి కూడా బాబే.. పేరేంటో తెలుసా?

ఇటీవల కొన్ని నెలల క్రితం తన బేబీ బంప్ ఫోటోలు షేర్ చేసి రెండోసారి ప్రగ్నెంట్ అయినట్టు హింట్ ఇచ్చింది ఇలియానా.

Ileana Dcruz Delivered A Baby Boy became Second Time Mother

Ileana : పోకిరి సినిమాతో ఒకప్పుడు తెలుగులో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన ఇలియానా ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. మైఖేల్ డోలన్ అనే విదేశీయుడిని సైలెంట్ గా పెళ్లి చేసుకొని గతంలో 2023 లో ఓ బాబుకు జన్మనిచ్చింది. తన బాబుకు ఫీనిక్స్ డోలన్ అని పేరు పెట్టినట్టు, ఫొటోలు కూడా షేర్ చేసి తెలిపింది.

ఇటీవల కొన్ని నెలల క్రితం తన బేబీ బంప్ ఫోటోలు షేర్ చేసి రెండోసారి ప్రగ్నెంట్ అయినట్టు హింట్ ఇచ్చింది ఇలియానా. తాజాగా నేడు ఉదయం తనకు మరో బాబు పుట్టినట్టు తెలిపి అతని క్యూట్ ఫోటోని షేర్ చేసి పేరు కూడా తెలిపింది.

Also See : Shraddha Srinath : మాల్దీవ్స్ లో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న జెర్సీ భామ.. బికినిలో ఫొటోలు..

ఇలియానా తన రెండో కొడుకు ఫోటో షేర్ చేసి జూన్ 19న జన్మించినట్లు, అతని పేరు కేను రాఫ్ డోలన్ అనే పేరు పెట్టినట్టు తెలిపింది. దీంతో ఫ్యాన్స్, పలువురు సెలబ్రిటీలు, నెటిజన్లు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.