హాలిడే ఎలా ఎంజాయ్ చేయాలో ఇలియానాను చూసి నేర్చుకోవాల్సిందే!

ఫ్రెండ్స్, ఫ్యామిలీతో కలిసి హాలీడే ఎంజాయ్ చేస్తున్న గోవా బ్యూటి ఇలియానా..

  • Publish Date - January 30, 2020 / 08:00 AM IST

ఫ్రెండ్స్, ఫ్యామిలీతో కలిసి హాలీడే ఎంజాయ్ చేస్తున్న గోవా బ్యూటి ఇలియానా..

గోవా బ్యూటి ఇలియానా ‘దేవుడు చేసిన మనుషులు’ తర్వాత టాలీవుడ్ వైపు కన్నెత్తి చూడలేదు. బాయ్ ఫ్రెండ్ ఆండ్రూతో కలిసి కొద్దిరోజులు డేటింగ్ చేసి తర్వాత బ్రేకప్ చెప్పేసి ఇండియా తిరిగొచ్చేసింది. రిలేషన్‌లో ఉన్నప్పుడు అడపాదడపా హిందీ సినిమాలు చేసింది.

Read Also : మహేష్ ఫ్యామిలీ డే అవుట్ – వైరల్ అవుతున్న పిక్స్

ఇల్లీ బేబి నటించిన ‘పాగల్ పంతీ’ ఇటీవలే విడుదలైంది. తర్వాత అభిషేక్ బచ్చన్ సరసన ‘ది బిగ్ బుల్’ సినిమా చేయనుంది. ఈ మధ్యలో కాస్త గ్యాప్ తీసుకుని ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌తో హాలిడే ట్రిప్ ప్లాన్ చేసుకుంది.

నచ్చిన ప్లేస్‌లో విహరిస్తూ, నచ్చిన ఫుడ్ లాగిస్తూ, బాయ్ ఫ్రెండ్ దగ్గర ఫోటోగ్రఫీలో నేర్చుకున్న ట్రిక్స్ ఉపయోగిస్తూ రకరకాల పిక్స్ ఇన్‌స్టాలో పోస్ట్ చేస్తూ సందడి చేస్తోంది. బాలీవుడ్ కథానాయకుడు అజయ్ దేవ్‌గన్ ‘ది బిగ్ బుల్’ చిత్రానికి ఒక నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. త్వరలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.